Fallen Mangoes Singapore: మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో మామిడి చెట్లు కనుక ఉండి ఉంటే.. అవి గనక కాయలు కాసి ఉంటే.. పక్వానికి వచ్చిన కాయలను తెంపకుండా ఉండి ఉంటే.. గాలి దుమారాలకు అవి రాలిపోతాయి. అటువంటి వాటిని చూస్తూ వదిలేయలేం. పైగా మనలో చాలామందికి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. అందువల్లే అలా పడిన పండ్లను ఊరికే వదిలేయం. కచ్చితంగా తీసుకొని తింటాం. దీనిని ఎవరూ తప్పుపట్టరు.
మనదేశంలో ఇలా ఉంటే.. అక్కడ మాత్రం విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే నోరు ఊరించే మామిడి కాయలు కింద పడి ఉంటే.. వాటిని వెనక తీసుకుంటే అక్కడ ఖచ్చితంగా నేరం. పైగా 3.5 లక్షల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.. అంతేకాదు ఆరు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతం పేరు సింగపూర్. ఇలాంటి నిబంధనలు సింగపూర్లో ఉండడానికి దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది
సింగపూర్ ప్రాంతంలో జనం బాగా తిరిగే ఏరియాలలో.. అక్కడి ప్రభుత్వం విపరీతంగా మొక్కలు నాటింది. అందులో మామిడి మొక్కలు కూడా ఉన్నాయి. ఇతర పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు చెట్లుగా ఎదిగిపోయాయి. వాటికి కాసే ఫలాలు ప్రభుత్వ ఆస్తులు. వాటిని తెంపడానికి ఉండదు. ఏరుకోవడానికి కూడా ఉండదు. ప్రభుత్వం కూడా వాటిని సేకరించదు. కేవలం ఆ ఫలాలు పశువులు, పక్షులు మాత్రమే తినాలని సింగపూర్ ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ నిబంధన అతిక్రమిస్తే 3.5 లక్షల ఫైన్ తో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాలి.
మనుషులు ఎక్కడైనా ఆహారాన్ని సేకరించుకోగలుగుతారు. పండ్లను కొనుగోలు చేసి తినగలుగుతారు. కానీ పశువులు అలా చేయలేవు. పక్షులకు ఆ అవకాశం లేదు. అందువల్లే ఆ చెట్లకు కాసిన పండ్లను అవి మాత్రమే తినే విధంగా సింగపూర్ ప్రభుత్వం నిబంధన విధించింది. దీనివల్ల పశువులు, పక్షుల ఆకలి తీరుతుంది. అవి ప్రశాంతంగా జీవించగలుగుతున్నాయి. సింగపూర్ తీసుకొచ్చిన నిబంధన విచిత్రంగా ఉన్నప్పటికీ.. దీనిని అమలు చేయడం అద్భుతమైన విషయమని సోషల్ మీడియాలో నెటిజన్లు కొనియాడుతున్నారు.