Dog Food Tasting Job: ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉదయం 10 గంటలకు వెళ్లి సాయంత్రం ఐదు గంటలకు రావాలి.. కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగాలు వేరే విధంగా ఉంటాయి. నిర్దిష్ట సమయానికి కార్యాలయానికి వెళ్లి వస్తే సరిపోతుంది.. ప్రైవేట్ కార్యాలయాలలో పనిచేసే వారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. అక్కడ పని చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్లే మేనేజ్మెంట్ చెప్పిన సమయానికి అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది.
నేటి కాలంలో వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోయింది కాబట్టి.. అర్ధరాత్రి పూట పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ఈ తరహా ఉద్యోగాలు కొనసాగుతూ ఉంటాయి.. అయితే కొన్ని ఉద్యోగాలు మాత్రం విచిత్రంగా ఉంటాయి.. చాలామంది ఇలాంటి వాటిని ఉద్యోగాలు అంటారా.. అని ఆశ్చర్యపోతారు కూడా.
సాధారణంగా మనం కార్యాలయాలకు వెళ్లి కష్టపడితే డబ్బులు వస్తాయని భావిస్తుంటాం. కానీ మనలో చాలామందికి జంతువులు తినే ఆహారాన్ని ముందుగా టేస్ట్ చేసే ఒక వింత ఉద్యోగం ఉందని విషయం తెలియదు. జంతువులకు సంబంధించి ఆహారాన్ని తయారుచేసే చాలావరకు కంపెనీలు.. ఉత్తమ ఉత్పత్తుల నాణ్యత.. రుచి వంటి వాటిని పరీక్షించేందుకు. పెట్ ఫుడ్ టెస్టర్ లను నియమించుకుంటాయి. వారు జంతువుల కోసం తయారు చేసిన ఆహారాన్ని రుచి చూస్తారు. వాసన పసిగడతారు. ఆకృతిని బట్టి లోపాలను చెబుతుంటారు. అయితే ఈ ఆహారంలో ఎటువంటి కెమికల్స్ వాడరు కాబట్టి సైడ్ ఎఫెక్టులు ఉండవు.
ఈ ఆహారం కుక్కల కోసం మాత్రమే తయారు చేస్తారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. పైగా అందులో ఎటువంటి హానికర పదార్థాలు ఉండవు. అయితే ఈ ఆహారాన్ని రుచి చూసే వారికి నెలకు లక్షలలో వేతనం ఉంటుంది. దాంతోపాటు ఇతర ప్రయోజమాలు కూడా లభిస్తాయి. పైగా ఇలాంటి ఉద్యోగాలకు ప్రొఫెషనల్ వ్యక్తులను మాత్రమే కంపెనీలు నియమించుకుంటాయి. మన దగ్గర కంటే వెస్ట్రన్ కంట్రీస్ లో చాలామంది కుక్కలను పెంచుకుంటారు. వాటికి పెట్టే ఆహారం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. అందువల్లే కంపెనీలు కుక్కల ఆహారం విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయి.