Uttar Pradesh: వెనుకటి కాలంలో బాల్యవివాహాలు అధికంగా జరిగేవి. ఆ తర్వాత కొంతకాలానికి మార్పు వచ్చింది. ఆడైనా మగైనా.. సరైన ఈడు జోడు ఉంటేనే పెళ్లి చేయడం మొదలైంది. అయితే ఇప్పటి కాలంలో మాత్రం పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తోంది. అలాగని బాల్య వివాహాలు జరగడం లేదు. వివాహానికి, ప్రేమకు వయసుతో సంబంధం లేదు అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఇటువంటి పరిణామాలు విదేశాలలో ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే నేటి కాలంలో ప్రపంచీకరణ వల్ల విదేశీ సంస్కృతిని మనవాళ్లు ఒంట పట్టించుకుంటున్నారు. ఇలా ఒంట పట్టించుకున్న సంస్కృతి వల్ల రకరకాల అనర్ధాలు జరుగుతున్నాయి. అలాంటి అనర్ధమే ఇది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జాన్పూర్ జిల్లాలో సంగ్రురామ్ అనే వృద్ధుడు ఉన్నాడు. ఇతడికి 75 సంవత్సరాలు. ఇతడికి గతంలోనే వివాహం జరిగింది. పిల్లలు కూడా కలిగారు. ఆ పిల్లలకు పిల్లలు జన్మించారు. అయితే సంగ్రు రామ్ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఆమె చనిపోయినప్పటికీ అతడు మళ్ళీ రెండవ వివాహం చేసుకోలేదు. అప్పటినుంచి అతడు ఒంటరిగానే ఉంటున్నాడు. బంధువులు రెండవ పెళ్లి చేసుకోమని చెప్పినప్పటికీ ఒప్పుకోలేదు. ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చినప్పటికీ అతడు చలించలేదు. అయితే ఇటీవల తన వయసులో సగం ఉన్న మంభావతి (35) అనే మహిళను వివాహం చేసుకున్నాడు..
తొలి భార్య చనిపోయి చాలా రోజులు ఒంటరిగా ఉన్న సంగ్రురాం ఆ నిర్ణయం తీసుకోవడం పట్ల బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దిగ్భ్రాంతికి గురయ్యారు. తనకంటూ ఒక తోడు కావాలని అనుకొని వారిద్దరి వివాహాన్ని ఒప్పుకున్నారు.. వివాహం జరిగిన రోజు ఇంట్లో అంతా సందడి వాతావరణం ఏర్పడింది. అయితే మరుసటి రోజు సంగ్రు రామ్ కన్నుమూశాడు. ఆరోగ్యంగా.. చలాకీగా ఉండే అతడు చనిపోవడం పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు.. అప్పటిదాకా తమతో సందడి చేసిన అతడు మరుసటి రోజు ఉదయం చనిపోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయం పట్ల మాంభాసవతిని వారు ప్రశ్నించారు. ” నన్ను ఇంటి బాధ్యతలు చూసుకోమని అన్నారు. మరుసటి రోజు ఇలా చనిపోయారు. ఏం జరిగిందో తెలియదని” మంభావతి కుటుంబ సభ్యులతో వాపోయింది.
మంభావతి చెప్పిన మాటలు అంత నమ్మశక్యంగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వచ్చి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తాము కేసు దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే అసలు నిజం బయటపెడతామని పోలీసులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సంగ్రురామ్ మరణించిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది..