Bigg Boss 9 Week 4 voting: ఈ వారం బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ లూడో గేమ్ స్టైల్ లో జరిగిన సంగతి అందరికీ నిన్న. చాలా ఆసక్తికరంగా టాస్కులు ఆడుతూ ఈ నామినేషన్స్ ని పూర్తి చేశారు. ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా ఈ నామినేషన్స్ లో వాడావేడి వాదనలు జరిగాయి. అలా హీట్ వాతావరణంలో జరిగిన ఈ నామినేషన్స్ లో ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు సంజన, మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజ, దివ్య నిఖిత, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి. వీరిలో ప్రస్తుతానికి సంజన కి అత్యధిక ఓటింగ్ పడుతున్నట్టు సమాచారం. ఈ వారం ఆమెకు తనూజ తో పెద్ద గొడవ అయ్యింది. ఆమె ఫ్యాన్స్ కూడా ఈమెకు ఓటు వేసే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఇంత ఓటింగ్ వస్తుందంటే ఆమెకు ఈ షో ద్వారా ఎలాంటి ఫ్యాన్ బేస్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ వారం ఆరంభం లోనే ఆమెకు రెండు నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. అయినప్పటికీ కూడా ఓటింగ్ లో ఇసుమంత ప్రభావం కూడా కనిపించడం లేదు. ఇది కచ్చితంగా గమనించాల్సిన విషయమే. ఇక ఈమె తర్వాతి స్థానం లో ఫ్లోరా షైనీ కొనసాగుతుంది. మొదటి వారమే ఎలిమినేట్ అయిపోతుందని అనుకున్న ఈమె, నాల్గవ వారం కూడా కొనసాగుతుందంటే చిన్న విషయం కాదు. మొదటి వారం ఈమె సంజన తో గొడవపడి కొంత కంటెంట్ ని తెచ్చుకుంది. రెండవ వారం నుండి ఈమెకు ఎలాంటి కంటెంట్ రాకపోయినప్పటికీ, సామాన్యులు చేసే అతిని భరించలేక, జనాలు ముందు వాళ్ళను ఒక్కొక్కరిగా పంపేయాలని నిర్ణయించుకున్నారు. ఆ కారణం చేతనే ఈమె ఇంకా హౌస్ లో కొనసాగుతుంది. ఇక ఈమె తర్వాతి స్థానం లో రీసెంట్ గా వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖిత నిల్చింది.
ఈమె అగ్నిపరీక్ష షో లోనే ఆడియన్స్ ని తన మాట తీరుతో ఆకట్టుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా నామినేషన్స్ సమయం లో తన మాట తీరుతో మరోసారి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈమె తర్వాతి స్థానం లో రీతూ చౌదరి కొనసాగుతుంది. ఈ వారం ఈమెని అన్యాయంగా నామినేట్ చేశారు. పాపం అనిపించింది, కానీ తనూజ, ఇమ్మానుయేల్ తో మంచి స్నేహంగా ఉంటున్నప్పటికీ కూడా ఎందుకో వాళ్ళిద్దరి ఫ్యాన్ బేస్ ఈమెకు ఓట్లు వేయడం లేదు. ఈమె తర్వాత చివరి రెండు స్థానాల్లో దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్ కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరిలో మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీజ దమ్ము డేంజర్ జోన్ లోకి వచ్చే కంటెస్టెంట్ కాదు కానీ, ఆమె మాట తీరు కారణంగా ఆడియన్స్ ఆమెని పూర్తిగా పక్కకి నెట్టే పరిస్థితి ఏర్పడింది.