Shocking Incident: నచ్చిన గర్ల్ ఫ్రెండ్.. మెచ్చిన గదికి వచ్చింది.. పడక కూడా బహు మెత్తగా ఉంది. లోపల కోరికలు దహించి వేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఆమె మీద దాడి చేద్దామా అనేటట్టుగా ఉసిగొల్పుతున్నాయి. అంతే కోరికలను అదుపు చేసుకోలేక.. గర్ల్ ఫ్రెండ్ ను అలా చూస్తూ ఉండలేక.. అతడు దాడి మొదలు పెట్టాడు.. తన ఉద్రేకాన్ని.. తనలో ఉన్న మన్మధుడిని బయటికి తీసి రస యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం పీక్స్ లో ఉండగా ఒక్కసారిగా చనిపోయాడు.. దీంతో అప్పటిదాకా ఒక రకంగా ఉన్న వాతావరణం వెంటనే మారిపోయింది.
ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2023 చైనాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. చైనాలోని 2023 లో ఒక పార్టీలో 66 సంవత్సరాల వృద్ధుడు తన మాజీ కొలీగ్ ను మీట్ అయ్యాడు. 1980 కాలంలో వారిద్దరు ఒకే కర్మగారంలో పనిచేసేవారు. చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో ఇద్దరి మధ్య మాటలు దొర్లాయి. ఆ తర్వాత వారిద్దరు అనేక సందర్భాలలో కలుసుకున్నారు. అతడికి అప్పటికే వివాహం జరిగింది. కాకపోతే ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అదే ఏడాది జూలై 24న వారిద్దరు ఒక హోటల్లో మీట్ అయ్యారు. రాత్రి మొత్తం రస యుద్ధం చేశారు. తెల్లవారుజామున ఆమె లేచి చూసేసరికి అతడు చనిపోయాడు. భయంతో ఒకసారి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. హోటల్ సిబ్బంది వచ్చి చూడగా అతడు చనిపోయి కనిపించాడు.
Also Read: పెళ్లై, కూతురున్నా ప్రియుడితో వెళ్లింది.. చివరకు ఇలా అయ్యింది
ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది ఆ వ్యక్తి కుటుంబానికి చెప్పారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి రహస్య స్నేహితురాలిపై కూడా ఫిర్యాదు చేశారు.. అయితే అతడు చనిపోవడానికి అనారోగ్య సమస్యలే ప్రధాన కారణం తెలుస్తోంది. హృదయం లేదా ఇతర అవయవాలకు సంబంధించిన సమస్యలు అతనికి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. రస యుద్ధంలో పాల్గొన్నప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అప్పుడు రక్త పోటు కూడా అధికమవుతుంది. అలాంటప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అతడికి ఆరోగ్యం సరిగా లేకపోవడం.. ఒత్తిడిని భరించలేకపోవడంతో చనిపోయి ఉంటాడని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇదే సమయంలో చనిపోయిన వ్యక్తిని అలా వదిలిపెట్టి వెళ్లిపోవడం ఆ మహిళ చేసిన తప్పు అని కోర్టు భావించింది. ఈ క్రమంలో సదరు మహిళలకు కోర్టు శిక్ష కూడా విధించింది. అయితే ఎటువంటి శిక్ష విధించిందనేది బయటికి తెలియ రాలేదు.