Japanese castle : ఆలసించినా ఆశాభంగం.. మీరే రాజు కావచ్చు.. రాజ భోగాలు అనుభవించవచ్చు

ఈ ప్యాలస్ లో ఓజు రాజు 16 వ శతాబ్దంలో అత్యంత విలాసవంతంగా జీవించినట్టు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆయన తరఫున బంధువులు కూడా ఈ ప్యాలస్ లో దర్జాగా బతికినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. 1888 సంవత్సరంలో ఈ ప్యాలస్ భూకంపం వల్ల దెబ్బతిన్నది.

Written By: NARESH, Updated On : April 3, 2024 11:20 am

Japanese castle

Follow us on

Japanese castle : ఎంతటి వారైనా సరే రాజు లాగానే బతకాలని కోరుకుంటారు. రాజభోగం అనుభవించాలని ఆశ పడుతుంటారు. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు.. కాకపోతే ఆర్థిక స్తోమత సహకరించకపోవడం వల్ల చాలామంది అలాంటి వాటిని కలలోనే ఊహించుకుంటూ తృప్తి పడుతుంటారు. అయితే ఇలాంటి కలలు మీకు వస్తే.. మీరు కలలోనే తృప్తి పడాల్సిన అవసరం లేదు. అలాంటి వారికోసం ఒక అద్భుతమైన ఆఫర్ ఉంది. ఆలసించినా మీదే ఆశాభంగం..

సినిమాల్లో మనం రాజభోగాల గురించి చూసే ఉంటాం. కథల్లో రాజరికాల గురించి చదివే ఉంటాం.. కానీ అలాంటి రాజ భోగాన్ని అనుభవించాలంటే పెట్టి పుట్టి ఉండాలి. అయితే అలా దిగులు పడాల్సిన అవసరం లేదు. రాజ భోగాన్ని అనుభవించాలి, రాజ విలాసాన్ని ఆస్వాదించాలి అనుకుంటే మీరు నేరుగా జపాన్ వెళ్లొచ్చు. అక్కడ ఒక రాజభవనం ఉంది. ఆ రాజభవనానికి మీరు చక్రవర్తి కావచ్చు. రాజు పొందే సౌకర్యాలన్నీ అనుభవించవచ్చు. అయితే ఇందులో చిన్న మెలిక ఉంది. అలా చేయాలంటే కచ్చితంగా మీరు చాలా డబ్బు ఖర్చు చేయాలి.

జపాన్ లోని ఎహిమ్ ప్రావిన్స్ లోని ఓజు నగరంలో ఓజూ కాజిల్ పేరుతో ఒక కోట ఉంది. దీనిని చెక్కతో నిర్మించినప్పటికీ అద్భుతంగా ఉంటుంది. దీనిని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఈ భవనం నాలుగు అంతస్తుల్లో ఉంటుంది. ఈ ప్యాలెస్ లో రాత్రంతా రాజు లాగా.. పగలంతా చక్రవర్తి లాగా జీవించవచ్చు.. “నీకు విలాసవంతంగా బతకాలనే కోరిక ఉంటే కచ్చితంగా ఇక్కడికి రా.. ఈ రాజ భవనంలో దర్జాగా అన్ని సౌకర్యాలు ఆస్వాదించు. నచ్చినది తిను. మెచ్చినది అనుభవించు. ఒకరోజు రాజు లాగా మారి దర్జాగా ఆ దర్పాన్ని ప్రదర్శించు. ఓజో ప్యాలెస్ కు చివరి రాజు కటో డైమ్యోస్ లాగా జీవించు” అని ఇక్కడి ప్యాలెస్ నిర్వాహకులు చెబుతుంటారు.

ఈ ప్యాలస్ లో ఓజు రాజు 16 వ శతాబ్దంలో అత్యంత విలాసవంతంగా జీవించినట్టు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆయన తరఫున బంధువులు కూడా ఈ ప్యాలస్ లో దర్జాగా బతికినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. 1888 సంవత్సరంలో ఈ ప్యాలస్ భూకంపం వల్ల దెబ్బతిన్నది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ కోటను పునర్నిర్మించారు. పూర్తిగా చెక్కతో ఆధునికీకరించారు. ఈ ప్యాలస్ లో ఒక్కరోజు బస చేయాలంటే దాదాపు 8 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. తినే తిండి దగ్గర నుంచి మొదలుపెడితే పడుకునే పడక వరకు అన్నీ మనం కోరుకున్నట్టే సమకూర్చుతారు.