Sobhan Babu Son: శోభన్ బాబు కుమారుడిని ఇండస్ట్రీలోకి రాకుండా అడ్డుకుంది ఎవరు?

శోభన్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కుటుంబ నేపథ్య సినిమాల్లో నటిస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

Written By: Swathi, Updated On : April 3, 2024 11:21 am

Sobhan Babu Son

Follow us on

Sobhan Babu Son: శోభన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకొని టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు. అప్పటి హీరోలతో పోటీ పడి మరీ సినిమాల్లో నటించారు. ఇక ఈయన కొడుకు కరుణ్ శేషు గురించి కూడా తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరో అవుతాడని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయనను చిత్ర సీమ లోకి ఎంట్రీ ఇవ్వకుండా చేశారు అనే టాక్ ఉంది. దీంతో ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారట.

శోభన్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కుటుంబ నేపథ్య సినిమాల్లో నటిస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈయన వందకు వంద శాతం సక్సెస్ అయ్యారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈయన కొడుకు కూడా ఇండస్ట్రీలోకి రావాలని శోభన్ బాబు అభిమానులు ఆశించారు. కానీ దీనికి భిన్నంగా ఆయన కెరీర్ ను ఎంపిక చేసుకున్నారు.

కరుణ్ శేషు ఇండస్ట్రీలోకి రాకుండా అప్పటికే పలు వ్యాపారాలు స్థిరపడ్డాయట. దీనికి కారణం ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం అని టాక్. దీంతో ఇండస్ట్రీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు శోభన్ బాబు కుమారుడు. అయితే ఈయన ఇండస్ట్రీలోకి రాకుండా అడ్డుకుంది ఎవరో కాదు ఆయన తండ్రి శోభన్ బాబే అని టాక్. అయితే తన కుమారుడిని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని సినీ ప్రముఖులు అడిగారట కానీ తన కుమారుడు వ్యాపారంలో రాణించాలని భావించారట శోభన్ బాబు. దీంతో సినిమాల వైపుకు ఆయనను తీసుకొని రాలేదు.

కొడుకుకు కొంచెం ఆసక్తి ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి బిజినెస్ లో మెలకువలు నేర్పించి వ్యాపారాలు చూసుకోమని చెప్పారట శోభన్ బాబు. అందుకే కరుణ శేషు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేకపోయారు. లేదంటే ఇతర హీరోల కుమారుల మాదిరి ఈయన కుమారుడు కూడా టాప్ హీరోలలో ఒకరిగా తన సత్తా చాటేవాడు కావచ్చు అంటారు శోభన్ బాబు అభిమానులు.