FA-22 Asteroid: విశ్వంలో గ్రహాలు భ్రమణం చెందుతూ ఉంటాయి.. అంతరిక్షంలో కేవలం గ్రహాలు మాత్రమే ఉండవు, ఇతర గ్రహ శకలాలు కూడా ఉంటాయి. ఇవి కూడా భ్రమణం చెందుతూ ఉంటాయి. అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుని ఇవి వేగంగా భ్రమిస్తూ ఉంటాయి. అందువల్ల ఒక్కోసారి అంతరిక్షంలో విపత్కరమైన సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అంతరిక్షంలో ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు చాలానే జరిగాయి. ఇప్పుడు మరో ఘటన చేరడానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల భూమికి ఎదురయ్యే ప్రమాదం గురించి క్లారిటీ ఇచ్చారు.
Also Read: రవి అస్తమించని బ్రిటీష్ రాజ్యంలో పరిస్థితి తలకిందులు ఎందుకైంది?
2025లో ఎఫ్ ఏ 22 అనే గ్రహశకలం సెప్టెంబర్ 18 ఉదయం 8: 33 నిమిషాలకు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చే అవకాశం ఉంది. అది ప్రస్తుతం భూమికి 8,41,988 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవి అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నది. ఇది త్వరలోనే భూమికి సమీపంలో వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. గురుత్వాకర్షణ పరిధిలోకి రాకపోవడం వల్ల భూమికి గ్రహశకలం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు. గ్రహ శకలం చుట్టుకొలత 163.88 మీటర్లు. పొడవు 280 మీటర్లు. అయితే నాసా ఈ గ్రహ శకలం కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నది.
అంతరిక్షంలో దుమ్ము దూళి కలిసి గ్రహశకలాలు ఏర్పడుతుంటాయి. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. గ్రహ శకలాలు ఏర్పడకపోతే అంతరిక్షంలో అలానే దుమ్ము పేరుకుపోతూ ఉంటుంది. దానివల్ల మరిన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడుతుంటాయి.. అయితే ఇటీవల కాలంలో ఆస్టరాయిడ్స్ భూమి మీదకు రావడం పెరిగిపోయింది.. అయితే వాటి వల్ల పెద్దగా ప్రమాదాలు చోటు చేసుకోకపోయినప్పటికీ.. ఈ పరిణామాలు శాశ్వత కాలంలో మంచివి కావని శాస్త్రవేత్తలు అంటున్నారు.. అంతరిక్షంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తాము పరిశీలిస్తున్నామని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.