Mukesh Ambani Viral Video: ముకేశ్ అంబానీ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఎక్కడ దాకా అయినా వెళ్ళగలరు. శూన్యంలో నుంచి వస్తువును సృష్టించగలడు. కొండమీది కోతిని కాళ్ళ దగ్గరికి తెచ్చుకోగలడు. అంతేనా బంగారం సింహాసనంలో కూర్చోగలడు.. వజ్రాలతో చేసిన మంచంపై శయనించగలడు. ప్లాటినంతో చేసిన పాత్రలలో భోజనం చేయగలడు. భారతదేశ ప్రభుత్వాన్ని శాసించగలడు. ప్రపంచంలో ఏ ప్రభుత్వంతోనైనా పని చేయించుకోగలడు. అందువల్లే కదా అతడి కుమారుడి వివాహం జరిగితే ప్రపంచ దేశాల నుంచి అతిరథ మహారధులు వచ్చారు. అతడు ఇచ్చిన ఆతిధ్యాన్ని స్వీకరించారు. పెళ్లి జరిగిన ముంబై నగరాన్ని మొత్తం అంబానికి అనుకూలంగా మార్చారంటే అతని స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఆగర్భ శ్రీమంతుడైన అంబానీ చేతులు పట్టుకొని వేడుకుంటున్న ఒక దృశ్యం.. చేతులు వణుకుతూ అతడి నోట్లో మంత్రం జపిస్తున్న సందర్భం.. పక్కనే సతీమణి ఉంచుకొని.. ప్రార్థిస్తున్న తీరు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. వాస్తవానికి అంబానికి దేవుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. దేవుడే అతడి దగ్గరికి వచ్చేలా చేయగలడు. కానీ అతనికి కూడా కర్మ సిద్ధాంతం అంటే ఎలా ఉంటుందో తెలుసు. అందువల్లే దేవుడి దగ్గరికి వెళ్తాడు. దేవుడు అంటే కష్టాల నుంచి తీర్చేవాడు కాదు.. కష్టాల నుంచి.. సమస్యల నుంచి.. ఒక ధైర్యాన్ని ప్రసాదించేవాడు.. శక్తిని అందించేవాడు.. అద్భుతాలను ఆవిష్కరించేవాడు.. అని అంబానీ నమ్ముతాడు. అందువల్లే తిరుమల తిరుపతి వెళ్లినా.. ముంబైలో గణపతిని దర్శించుకున్నా అదే వినమ్రతను ప్రదర్శిస్తాడు.. మనసులో ఏం కోరుకుంటాడో.. ఏం ఆశిస్తాడో తెలియదు కానీ.. దేవుడికి పూజ చేస్తుంటే మాత్రం కచ్చితంగా అంబానీ చేతులు వణికిపోతూ ఉంటాయి. పెదాలు యాదృచ్ఛికంగా స్వామివారి పదాలను పలికిస్తుంటాయి.
చాలామంది అంబానీ భయస్తుడు.. అనుకుంటారు. దైవం విషయంలో మాత్రమే అతడు తలవంచుతాడు. అంతర్యామిని చూడగానే సాష్టాంగ పడతాడు. ఎందుకంటే దేవుడంటే ఒక నమ్మకం. దేవుడంటే ఒక అద్భుతం. దేవుడంటే అతింద్రియ శక్తి. అందువల్లే తాను ఇక్కడ దాకా వచ్చానని.. ఈ స్థాయిలో ఉన్నానని.. ఇంతమందికి ఉపాధి కలిగించానని.. ఆకాశాన్ని తాకే భవనం అంచులో ఉన్నానని భావిస్తుంటాడు అంబానీ. అందువల్లే తన కొడుకు ముందస్తు పెళ్లి వేడుకలో.. పెళ్లి వేడుకలు దేవుళ్ళ ప్రతిమలను ఏర్పాటు చేయించాడు. గుజరాతి సంప్రదాయాన్ని కాదు.. సమూల సనాతన సంస్కృతిని ప్రతిబింబించాడు. దేవుడిని పూజించడం మాత్రమే కాదు.. దేవుడంటే భయం కూడా ఉండాలని నిరూపించాడు. లక్షల కోట్లకు ఎదిగినప్పటికీ.. లక్షల మందికి ఉపాధి కలిగించినప్పటికీ.. ఒదిగి ఉండడమే అసలైన మనిషి లక్షణమని నిరూపించాడు అంబానీ. తాజాగా సోషల్ మీడియాలో ముంబైలోని గణపతి ప్రతిమను దర్శించుకున్న తర్వాత.. అంబానీ చేతులతో వేడుకుంటున్న దృశ్యం అనిపిస్తోంది. దేవుడిని ప్రార్థిస్తున్న సమయంలో అంబానీ ఒక సామాన్య మనిషిలాగ దర్శనమిస్తున్నాడు.
దేవుడు అంటే మన కష్టాలు తీర్చే వాడు కాదు
మన కష్టాల నుండి సమస్యల నుండి గట్టెక్కించే ధైర్యం ఇచ్చే ఒక అద్భుతం….లక్షల కోట్లు ఉన్నోడు కూడా దేవుడిని ఆ ధైర్యం అడిగే ఒక సామాన్య మనిషే pic.twitter.com/evyhkNEKOO
— Mahesh Goud #9999# (@indian66669296) September 4, 2025