Most Expensive Liquor Brands: నేటి కాలంలో మద్యం తాగడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. చాలామంది యువతీ యువకులు మద్యం తాగుతున్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న వారిలో కొంతమంది తమ స్థాయిని ప్రదర్శిస్తున్నారు.. రొటీన్ బ్రాండ్లను పక్కనపెట్టి.. విలువైన కంపెనీల మధ్యాన్ని కొనుగోలు చేసి తాగుతున్నారు. వాస్తవానికి తాగే మద్యం అంతా ఒకటే కాదు. కంపెనీల ప్రకారం అందులో ఉన్న రుచి మారుతూ ఉంటుంది. కొన్ని బ్రాండ్ల కంపెనీలు అత్యంత విలువైన మద్యం తయారు చేస్తాయి.. వీటికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. ఇలా ప్రపంచప్తంగా డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్లు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
D’AMLFI LIMONCELLo
D’AMLFI LIMONCELLo అనేది ఇటలీలో ప్రాచుర్యం పొందిన బ్రాండ్. ఇది అత్యంత ఖరీదైన మద్యం. ఇటలీలో లభించే ఒక రకమైన నిమ్మ పండ్ల నుంచి ఈ మద్యం తయారు చేస్తారు. ఇది ఒక ఫుల్ బాటిల్ ధర 390 కోట్లు. దీనికి అంత ధర ఉండడానికి ప్రధాన కారణం.. మద్యం సీసాను వజ్రాలతో తయారుచేస్తారు. అంతేకాదు మద్యం తయారు చేయడంలో Amalfi lemons ఉపయోగిస్తారు. ఈ బ్రాండ్ తయారు చేయడానికి చాలా రోజులు పడుతుంది.
Isabella’s islay whisky
Isabella’s islay whisky ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీగా పేరుపొందింది. ఈ బ్రాండ్ ఫుల్ బాటిల్ ఖరీదు వచ్చేసి 51 నుంచి 52 కోట్ల వరకు ఉంటుంది. ఈ బాటిల్ ను వజ్రాలతో తయారుచేస్తారు. పైగా ఖరీదైన వజ్రాలు వాడతారు. అందువల్లే ఈ సీసా వైట్ గోల్డెన్ క్రిస్టల్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. తెలుపు వజ్రలను ఒక క్రమ పద్ధతిలో అలంకరించి.. ఈ సీసాలో విస్కీ పోస్తారు. ఈ విస్కీ కి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఎంపిక చేసిన వారికి మాత్రమే ఈ మద్యాన్ని విక్రయిస్తారు.
Billionaire vodka
పేరులోనే ఈ వోడ్కా ఎంత స్పెషల్ అర్థమవుతుంది. కేవలం శ్రీమంతులు మాత్రమే దీనిని కొనుగోలు చేయాలని దానికి బిలియనీర్ వోడ్కా అని పేరు పెట్టారు.. లగ్జరీ స్పిరిట్ ఉపయోగించి ఈ మద్యం తయారు చేశారు. ఇందులో ఆల్ట్రా రిచ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని ఫుల్ బాటిల్ ధర 32.8 కోట్లు. ఈ బాటిల్ పై భాగంలో దాదాపు 3,000 వజ్రాలతో అలంకరించారు. అవన్నీ కూడా ఈ బ్రాండ్ మద్యానికి విశేషమైన గుర్తింపుని తీసుకొచ్చాయి.
The macallan(1926)
The macallan(1926) ఇది ప్రపంచంలో ఖరీదైన విస్కీలలో ఒకటి. అయితే ఇప్పటివరకు కేవలం 40 సీసాలను మాత్రమే తయారు చేశారు. ఒక బాటిల్ ధర దాదాపు 22 కోట్ల వరకు ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలతో ఈ విస్కీ తయారు చేశారు. అయితే అవన్నీ కూడా అత్యంత అరుదైనవి. అందువల్లే ఈ బ్రాండ్ విస్కీ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 40 సీసాలు మాత్రమే తయారు చేశారు.. కొంతమంది ఎంపిక చేస్తున్న వ్యక్తులకు మాత్రమే వీటిని విక్రయించారు.
Henri dudognon heritage cognac
Henri IV dudognon heritage cognac అనేది ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం.ఒక్కో ఫుల్ బాటిల్ ఖరీదు 16 నుంచి 17 కోట్ల వరకు ఉంటుంది. ఈ బాటిల్ ఆకృతి కూడా భిన్నంగా ఉంటుంది. వజ్రాలు, బంగారం, ప్లాటినం వంటి అత్యంత ఖరీదైన ఖనిజాలతో ఈ బాటిల్ రూపొందించారు. అందువల్లే దీనికి అంత ధర.