Defender Cow Dung Cakes: ఖరీదైన వస్తువులను.. ఖరీదైన పనులకు మాత్రమే ఉపయోగించాలి. అలాకాకుండా, వేరే పనులకు ఉపయోగిస్తే తేడా కొట్టేస్తుంది. నవ్వు పుట్టేస్తుంది. అటువంటిదే ఈ వీడియో కూడా.. పైగా సోషల్ మీడియా విస్తృతమైన వినియోగంలో ఉన్న నేటి రోజుల్లో ఇటువంటి వీడియోలు విపరీతమైన సర్కులేషన్లో ఉన్నాయి. అంతేకాదు చూసే వాళ్లకు ఆనందాన్ని, కడుపునిండా నవ్వును తెప్పిస్తున్నాయి.
ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం అత్యంత ఖరీదైన డిపెండర్ వాహనం దర్శనమిస్తోంది. దాని విలువ ఏకంగా 1.5 కోట్లు. మనదేశంలో డిఫెండర్ వాహనాలను శ్రీమంతుడు మాత్రమే వాడుతారు. ఎందుకంటే దీని మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్రయాణించడాన్ని చాలామంది తమ స్టేటస్ సింబల్ లాగా భావిస్తుంటారు. హైవేల మీద ఒక్కసారి ఈ కారులో ప్రయాణిస్తే.. జన్మలో ఆ అనుభూతిని మర్చిపోరు. కొంతకాలంగా మనదేశంలో డిపెండర్ కార్ల వినియోగం పెరిగిపోయింది. అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో డిపెండర్ కారు తన ఉనికినే ప్రశ్నార్థకం చేసుకునే స్థాయికి దిగజారింది.
డిపెండర్ కారు ఓ ప్రాంతంలో రాజసంగా పార్క్ చేసి ఉంది. అయితే ఒక మహిళ వచ్చి తన చేతుల్లో ఉన్న ఆవు పేడను కారు వెనుక భాగంలో పెట్టింది. దీంతో చూసేవాళ్ళకు ఆ సన్నివేశం ఒక్కసారిగా షాక్ కలిగించింది. వాస్తవానికి డిఫెండర్ లాంటి వాహనంలో ఆవు పేడను రవాణా చేయడం ఒక రకంగా ఆశ్చర్యకరమని చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే కొంతమంది తమ సాంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారని.. వాటి ముందు ఎంతటి ఖరీదైన వాహనాలైనా పట్టించుకోరని మరి కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు. సంప్రదాయ విధానాల ద్వారా డబ్బులు సంపాదించేవారు.. ఖరీదైన వాహనాలను కొనుగోలు చేస్తారని.. అందులో ఆవు పేడ.. ఇతర వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారని.. ఇలా చేయడం వల్ల వారికి కలిసి వస్తుందని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ డిపెండర్ వాహనంలో ఆవు పేడను రవాణా చేయడం మాత్రం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది.
View this post on Instagram