Durex Viral Campaign: ఓ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. అది బుర్రా? బూతా? కమెడియన్ ప్రవీణ్ ను ఉద్దేశించి అంటాడు.. గుర్తుంది కదా.. ఇప్పుడు ఈ సంస్థ రూపొందించిన ప్రకటన విషయంలో కూడా నెటిజన్లు అలాగే ప్రశ్నిస్తున్నారు. పైగా తమ వాణిజ్య ప్రకటన కోసం ఏకంగా భారత మహిళల జట్టును ఉపయోగించుకోవడం ఏంటని.. వారు సాధించిన వరల్డ్ కప్ విజయాన్ని ఇలా వాడుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మన దేశంలో లైంగిక పరమైన ఉత్పత్తులను తయారుచేసే సంస్థగా డ్యూరెక్స్ (Durex) కొనసాగుతోంది. ఇది లైంగిక కార్యకలాపాలలో పాల్గొనే సమయంలో ఉపయోగించే తొడుగులను.. తయారు చేయడం మాత్రమే కాకుండా.. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటుంది. డ్యూరెక్స్ శృంగార ఉద్దీపన మాత్రలను, స్ప్రే, ఇతర వస్తువులను కూడా తయారు చేస్తూ ఉంటుంది.. ఈ కంపెనీకి బలమైన మార్కెటింగ్ వ్యవస్థ ఉంది. అందువల్లే దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
డ్యూరెక్స్ రూపొందించే ప్రకటనలు ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా మార్కెటింగ్ టీం రూపొందించే ప్రకటనలు సంచలనానికి కేంద్ర బిందువు అవుతుంటాయి. ఇటీవల టీమిండియా మహిళలు వరల్డ్ కప్ సాధించారు. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించారు. భారత క్రికెట్ జట్టు మహిళలు సాధించిన ఈ అద్భుతం పట్ల ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు, ప్రశంసలు లభించాయి. ఈ క్రమంలో డ్యూరెక్స్ మార్కెటింగ్ టీం తన పని ప్రారంభించింది. భారత క్రికెట్ జట్టు మహిళలు సాధించిన విజయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది.
సోషల్ మీడియాలో డ్యూరెక్స్ వదిలిన పోస్ట్ సంచలనంగా మారింది. ముంబైలో టీమిండియా విజయం సాధించిన తర్వాత.. ఆ గ్రౌండ్ మొత్తాన్ని ఫోటో తీసిన డ్యూరెక్స్ బృందం… ఫీల్డ్ మీద here is to our woman in male dimented fields అని రాసుకోచ్చింది. 2023లో టీ మీడియా వరల్డ్ కప్ ఫైనల్ వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు చేతుల్లో ఓటమిపాలైంది. కానీ, ఇదే భారత మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై విజయం సాధించింది. ఈ అర్ధాన్ని కొనసాగిస్తూనే.. దానికి ద్వంద్వార్ధాన్ని జత చేసింది. పురుషుల ఆధిపత్యం కొనసాగుతున్న క్రికెట్లో.. మహిళలు పై చేయి సాధించారు అని రాసింది. ఈ ప్రకటన అద్భుతంగా ఉందని.. బూతులు నేటి కాలంలో దర్జాగా చలామణి అవుతున్న సందర్భంలో.. ఇలా కూడా ఉపయోగించవచ్చా.. అని నెటిజన్లు నోర్లు వెళ్లబెడుతున్నారు..