Maharashtra Dog Walker: మనదేశంలో అత్యధిక వేతనాలు ఉన్న పరిశ్రమ ఏదైనా ఉందంటే అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే. ఇందులో పని చేస్తున్నవారు ప్రతినెల లక్షల నుంచి కోట్ల వరకు వేతనాలు అందుకుంటారు. ఐఐటీ లాంటి ఉన్నత విద్యాసంస్థలలో చదివిన వారు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలలో పని చేస్తుంటారు. ఆ కంపెనీలు వారి చదువుకు తగ్గట్టుగానే వేతనాలు ఇస్తుంటాయి. కనివిని ఎరుగని స్థాయిలో ప్యాకేజీలు ఇస్తుంటాయి. అయితే ఆ కార్పొరేట్ కంపెనీలలో పని చేయాలంటే బలమైన నేపథ్యం ఉండాలి. ఘనమైన చదువు ఉండాలి.
కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఆ యువకుడు గొప్ప గొప్ప విద్యాసంస్థల్లో చదవలేదు. అలాగని గొప్ప గొప్ప కార్పొరేట్ కంపెనీలలో పనిచేయడం లేదు. అయితే అతడు ప్రతినెల 4.5 లక్షలు సంపాదిస్తున్నాడు. అలాగని అతడేమీ వ్యాపారం చేయడం లేదు. అతని పేరు మీద భారీగా ఆస్తులు లేవు. అంతస్తులు కూడా లేవు. ముంబై లాంటి మహానగరంలో అతడు ప్రతినెల 4.5 లక్షలు సంపాదిస్తాడు. అలాగని చెమట చిందించడు. ఒళ్ళును ఇబ్బంది పెట్టుకోడు. ఇంతకీ యువకుడు ఏం చేస్తున్నాడంటే..
ముంబై నగరం మనదేశ ఆర్థిక రాజధాని. ఇక్కడ ఆగర్భ శ్రీమంతులు ఎక్కువగా ఉంటారు. సహజంగానే డబ్బు ఎక్కువగా ఉన్న వారికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. అలాంటి వ్యాపకాలలో ప్రధానమైనది కుక్కలని పెంచుకోవడం. డబ్బున్నవాళ్లు విదేశాల నుంచి కుక్కలను దిగుమతి చేసుకుంటారు. వాటిని అపురూపంగా చూసుకుంటారు. అయితే వాటిని చూసుకునే ఆ సమయం కూడా లేనివారు కూడా ఉన్నారు. అలాంటి వారి కోసమే మనం ఈ కథనం ప్రారంభంలో చెప్పిన వ్యక్తి ఉన్నాడు. అతడు ప్రతిరోజు ఉదయం ముంబైలో పెద్ద పెద్ద శ్రీమంతుల ఇంట్లో ఉన్న కుక్కలను వాకింగ్ తీసుకెళ్తాడు.. ఇలా ఒక్కొక్క నుంచి నిర్ణీత మొత్తంలో చార్జి వసూలు చేస్తాడు. ప్రస్తుతం అతడు 38 కుక్కలను ప్రతిరోజు విడతల వారీగా వాకింగ్ తీసుకెళ్తూ ఉంటాడు. వాటిని ముంబై నగరంలో కొంత పరిధిలో తిప్పి మళ్లీ శ్రీమంతుల ఇంట్లోకి పంపిస్తాడు. గొప్ప గొప్ప ఇంజనీర్లు నేటి రోజుల్లో ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే.. ఇతడు మాత్రం కుక్కల మీద ఆధారపడుతూ ప్రతినెల 4.5 లక్షలు సంపాదిస్తున్నాడు..
సమయానికి డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్లడం వారి కుక్కలను తీసుకోవడం వాకింగ్ వెళ్లడం ఇతడి దినచర్య. ఇతడు తమ్ముడు ఎంబీఏ చేసినప్పటికీ నెలకు 70 వేల కు నుంచి సంపాదించలేకపోతున్నాడు. ఈ వ్యక్తి మాత్రం అంతంతమాత్రం చదువుతో నే ప్రతినెల 4.5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇది ముంబైలోని ఒక కార్పొరేటర్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ వేతనానికంటే ఎక్కువ . ఓ మధ్య స్థాయి ఐటీ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్న వ్యక్తి కంటే ఈ జీతం చాలా ఎక్కువ. అయితే ఆ కుక్కలను సదరు వ్యక్తి అత్యంత ప్రేమగా చూసుకుంటాడు. వాటి మూడ్ ను పరిశీలించి.. ఇష్టమైన ప్రాంతాలకు తీసుకెళ్తుంటాడు. ఆ కుక్కలు వాటి యజమానితో ఎంతైతే ప్రేమగా ఉంటాయో.. ఇతడితో కూడా అంతే ప్రేమగా ఉంటాయి.. పైగా ఇతడు ఆ కుక్కలపై అత్యంత ప్రేమను కనబరుస్తుంటాడు. అందువల్లే అవి ఇతడిని ఇష్టపడుతుంటాయి. కేవలం కుక్కలను వాకింగ్ తీసుకెళ్లడం ద్వారా ప్రతినెల 4.5 లక్షల సంపాదించడం అంటే మాటలు కాదు. అందుకే చదువు అనేది జ్ఞానానికి మాత్రమే సంబంధించింది. అదే వివేకం మన జీవితానికి సంబంధించింది. మన వివేకం ఎంత బాగా పని చేస్తే జీవితం అంత గొప్పగా ఉంటుంది. దానికి ఉదాహరణ ఈ వ్యక్తి.
View this post on Instagram