Homeలైఫ్ స్టైల్Mindset : ధనవంతులు అవ్వాలంటే ఈ మైండ్‌సెట్ మార్చుకోవాలి!

Mindset : ధనవంతులు అవ్వాలంటే ఈ మైండ్‌సెట్ మార్చుకోవాలి!

Mindset: డబ్బున్నోళ్లు ఇంకా ధనవంతులు అవుతున్నారు. పేదోళ్లు ఇంకా పేదవారిగానే మిగిలిపోతున్నారు అని చాలా మంది అంటుంటే వింటుంటాం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా అలాగే చెప్పి మనల్ని పెంచుతారు. అందుకు తగ్గట్టుగానే మనమూ ఆలోచిస్తాం. కానీ, ఈ ఆలోచన విధానం చాలా తప్పని నిపుణులు చెబుతున్నారు. ఈ మైండ్‌సెట్ మారితేనే మనం కూడా ధనవంతులు అవ్వగలమని సూచిస్తున్నారు. డబ్బు చెట్లకు కాయవని చెబుతుంటారు మన పెద్దలు. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేయడం నేర్పిస్తారు. అది పొదుపులో ముఖ్యమైన భాగమే అయినప్పటికీ.. నాణేనికి మరో వైపు ఉంటుందని మనం ఆలోచించం. మన మైండ్‌సెట్‌లో డబ్బును ఎప్పుడూ కొరతలాగానే చూస్తాం. అంతులేని సమస్యగానే భావిస్తాం. కానీ, ఓసారి నిజమైన ధనవంతులు ఎలా ఆలోచిస్తారో గమనించాలి. వాళ్లు డబ్బును పవర్ ఫుల్ ఆయుధంగా చూస్తారు. ఆ డబ్బును ఉపయోగించి, ఇంకా డబ్బు ఎలా సంపాదించాలో పిల్లలకు నేర్పుతారు.

Also Read:  జీవితంలో ఎదగాలనుకుంటే స్టీవ్ జాబ్స్ చెప్పిన.. ఈ పంచ సూత్రాలు పాటించాల్సిందే!

మన పెద్దలు డబ్బు చెట్లకు కాయవు అని చెబుతుంటారు. ఇది నిజమే డబ్బును సంపాదించడానికి కష్టపడాలి. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేయాలని, పొదుపు చేయాలని నేర్పిస్తారు. పొదుపు అనేది ఆర్థికంగా స్థిరపడటానికి చాలా ముఖ్యమైన భాగం. అయితే, మనం కేవలం పొదుపు గురించి మాత్రమే ఆలోచించి, డబ్బును సంపాదించే ఇతర మార్గాల గురించి ఆలోచించం. చాలామందికి డబ్బు ఎప్పుడూ ఒక కొరతగా ఒక సమస్యగా కనిపిస్తుంది. కానీ, ధనవంతులు మాత్రం డబ్బును కేవలం ఖర్చు చేసే వస్తువుగా కాకుండా, ఒక శక్తివంతమైన సాధనంగా చూస్తారు. డబ్బును ఎలా పెంచాలో పెట్టుబడులు ఎలా పెట్టాలో వారికి తెలుసు. వారి పిల్లలకు కూడా ఇదే విషయాన్ని నేర్పిస్తారు. ఈ ఆలోచనా విధానంలోనే అసలైన తేడా ఉంది.

ధనవంతులు డబ్బును రీసోర్స్ గా చూస్తారు. వారు డబ్బును ఉపయోగించి మరిన్ని అవకాశాలను క్రియేట్ చేసుకుంటారు. ఉదాహరణకు, వారు పొదుపు చేసిన డబ్బును కేవలం బ్యాంక్‌లో ఉంచకుండా, వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు, షేర్లు కొంటారు లేదా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడతారు. ఈ పెట్టుబడుల ద్వారా వారికి మరిన్ని ఆదాయ వనరులుగా మారిపోతాయి. దీంతో పాటు ధనవంతులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు. రిస్కులు తీసుకోవడం ద్వారా వారు తమ సంపదను మరింత పెంచుకుంటారు. అలాగే, వారు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఆర్థిక అవగాహన మరింత పెంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ అలవాట్లు వారిని ఆర్థికంగా మరింత బలపరుస్తాయి.

Also Read: భార్యాభర్తలు కలిసి ఈ పనులు చేస్తే సమస్యల్లో ఇరుక్కున్నట్లే..

మీరు కూడా ధనవంతులు కావాలంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. డబ్బు ఒక సమస్య కాదు, అది ఒక అవకాశం అని గుర్తించాలి. కేవలం డబ్బును ఖర్చు చేయడమే కాకుండా దానిని ఎలా పెంచాలో నిరంతరం ఆలోచించాలి. చిన్న మొత్తాలతోనైనా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా చిన్న వ్యాపారాలలో పెట్టుబడుల గురించి అవగాహన పెంచుకోవాలి. డబ్బును ఎలా మెయింటైన్ చేయాలి, పెట్టుబడులు ఎలా చేయాలి వంటి వాటి గురించి పుస్తకాలు చదవాలి.. సెమినార్లకు అటెండ్ అవ్వాలి. మీ ప్రధాన ఆదాయంతో పాటు, పార్ట్-టైమ్ వ్యాపారం లేదా ఏదైనా స్కిల్స్ ఉపయోగించి ఎక్స్ ట్రా ఇన్ కం సంపాదించడానికి ప్రయత్నించాలి. ఈ మార్పులతో మీరు కూడా ఖచ్చితంగా ధనవంతులు అవడానికి దారి ఏర్పడుతుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular