spot_img
Homeవింతలు-విశేషాలు62 Years No Sleep: 62 ఏళ్లుగా కంటిమీద కునుకు లేదు..ఐనా దర్జాగా బతికేస్తున్నాడు..

62 Years No Sleep: 62 ఏళ్లుగా కంటిమీద కునుకు లేదు..ఐనా దర్జాగా బతికేస్తున్నాడు..

62 Years No Sleep: ఆకలి, శారీరక సాంగత్యం, నిద్ర అనేది మనిషికి కనీస అవసరాలు.. ఈ అవసరాలు తీరకపోతే మనిషి చాలా ఇబ్బంది పడతాడు. అంతేకాదు మానసిక ఒత్తిడి ఎదుర్కొని నరకం చూస్తాడు. మిగతా వారి విషయంలో ఏమోగాని.. ఇతడు మాత్రం ఆకలి, శారీరక సాంగత్యం విషయంలో మాత్రం ఎలా ఉంటాడో తెలియదు గాని.. నిద్ర విషయంలో మాత్రం ఎవరి అంచనాలకు అందడు. పేరుపొందిన శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు..

ఒక మనిషి నిద్రపోకుండా ఉండడం సాధ్యం కాదు. ఒకవేళ ఉండాలి అనుకుంటే కొద్దిసేపు మాత్రం సాధ్యమవుతుంది. ఎందుకంటే శరీరానికి సరైన స్థాయిలో విశ్రాంతి లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. పైగా విశ్రాంతి తీసుకోవాలి అని శరీరం అనుకున్నప్పుడు యధావిధిగా సంకేతాలు ఇస్తూనే ఉంటుంది. కళ్ళు మూతలు పడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఏ పని చేయడానికి అవకాశం ఉండదు. ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటేనే శరీరం రీఛార్జ్ అవుతుంది.. మళ్లీ పూర్వ శక్తిని సంతరించుకొని పనిచేయడం మొదలు పెడుతుంది. కానీ.. ఇతడి విషయంలో భగవంతుడు రాసిన స్క్రిప్ట్ వేరే విధంగా ఉంది. అందువల్లే ఇతడు ప్రపంచంలోనే వింతైన వ్యక్తిగా అవతరించాడు.

ఆ వ్యక్తి పేరు థాయ్ న్గోక్.. గడిచిన 62 సంవత్సరాలుగా ఇతడు నిద్రపోవడం లేదు. ఇతడు నిద్రపోకపోవడానికి బలమైన కారణం ఉంది. 1962లో ఇతడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. దీంతో అతడు నిద్రపోయే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయాడు. వాస్తవానికి ఒక మనిషి ఎక్కువ రోజులు నిద్రపోకపోతే చనిపోతాడు. కానీ ఇతడు మాత్రం నిద్ర లేకుండానే బతికేస్తున్నాడు. ప్రతిరోజు పొలం పనులు చేస్తున్నాడు. ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. ఈ వింత శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పరిశోధకులు కూడా ఇతడి మీద అనేక ప్రయోగాలు చేశారు. అయినప్పటికీ అతడు శరీరంలో జరిగిన మార్పును కనిపెట్టలేకపోయారు.. జ్వరం వల్ల మనిషి నిద్రపోయే సామర్ధ్యాన్ని కోల్పోతాడా.. అనే అంశంపై పరిశోధనలు చేసినప్పటికీ.. వారు అనుకున్న సమాచారం లభించలేదు.

థాయ్ నిద్రపోకుండా ఉంటున్నప్పటికీ అతడి ఆరోగ్యంలో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. అతడికి ఎటువంటి వ్యాధులు రావడం లేదు. పైగా రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంది. అతనిలో ఉత్సాహం ఒకప్పటి మాదిరిగానే ఉంది. స్వేచ్ఛగా పనులు చేస్తున్నాడు. హాయిగా తింటున్నాడు. పొలం పనుల్లో కూడా ఒకప్పటి మాదిరిగానే ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. అందువల్లే అతడికి నిద్ర లేకపోయినా సరే ఏమి కావడం లేదని వైద్యులు అంటున్నారు. ఇటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని.. వైద్యులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...
Oktelugu Epaper