Magh Mela 2026 Prayagraj Basmati: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవరు సెలబ్రిటీ అవుతారో అర్థం కావడం లేదు. సెలబ్రిటీ అయిన తర్వాత రకరకాల అవకాశాలు వస్తుంటాయి. కార్పొరేట్ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటాయి. సినిమా అవకాశాల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
గత ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహాకుంభమేళా జరిగింది. ఆ కార్యక్రమంలో పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి సోషల్ మీడియాలో పడి సెలబ్రెటీ అయింది. ఆమెను నెటిజన్లు ఏకంగా మోనాలిసాను చేశారు. ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాల్లో నటిస్తోంది. పలు కంపెనీల ఉత్పత్తులకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.
ఇప్పుడు మోనాలిసా దారిలోనే మరో యువతి వచ్చింది. ఆమె కూడా ఉత్తర ప్రదేశ్ లోనే వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా విశేషమైన ప్రాచుర్యాన్ని పొందుతోంది. ఆ యువతి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో గంగా నదిలో పౌష్య పౌర్ణమి సందర్భంగా మాఘ మేళ ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాధువులు గంగా నది తీరానికి భారీగా వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంటున్నది. దేశవ్యాప్తంగా భక్తులు రావడంతో ఆ ప్రాంతం మొత్తం కిటకిటలాడుతోంది. ఒక రకంగా మాఘ మేళా మినీ కుంభమేళాను తలపిస్తోంది.
గత ఏడాది జరిగిన కుంభమేళాలో మోనాలిసా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈసారి మాఘ మేళ లో దంత కర్రలు అమ్ముతున్న బాస్మతి అనే అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. బాస్మతి అనే అమ్మాయి చూసేందుకు ఎంతో అందంగా ఉంది. అమాయకత్వంతో కనిపిస్తోంది. ఆమె మాటలు.. నవ్వు అత్యద్భుతంగా ఉన్నాయి. చాలామంది యూట్యూబర్లు ఆమెను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నీతో చాలామంది ఆమెను నయా మోనాలిసా అని భావిస్తున్నారు.. కేవలం బాస్మతి మాత్రమే కాకుండా అప్సాన, అనే అమ్మాయి కూడా సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చలో ఉంది. అప్సనా మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా ప్రాంత నివాసి. అప్సాన మోనాలిసాకు బంధువు అవుతుంది. అప్సాన కూడా ఈ ఉత్సవంలో దండలు విక్రయిస్తోంది.
मोनालिसा के बाद अब लोग इनके दीवाने हैं
ये बासमती हैं
ये प्रयागराज के माघ मेला में माला बेचने आई हैं
लोग इन्हें देखने के लिए भीड़ लगा रहे हैं
इससे पहले मोनालिसा आईं थीं, जिन्हें इलाहाबाद ने स्टार बना दिया था।#monalisa #basmati #prayagraj pic.twitter.com/KDQHND8lQ9
— Anaadi TV UP (@AnaadiTVUP) January 4, 2026