Oneplus Turbo Series: అదేదో సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చీప్.. వేరీ చీప్.. అంటుంటారు కదా.. ఇప్పుడు ఈ ఫోన్ కూడా అటువంటిదే. స్మార్ట్ కాలంలో ఫీచర్లకు తగ్గట్టుగా ఫోన్ల ధరలు ఉంటున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు ఏమైనా ఒడిదుడుకులకు గురైతే.. ఆ ప్రభావం ఫోన్ల ధరల మీద పడుతోంది. అయితే మన దేశంలో స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్లేయర్లలో ఒకటిగా సాగుతున్న oneplus కంపెనీ.. 2026 సందర్భంగా అద్భుతమైన ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికైనా మార్కెట్లో జనవరి 8న ఈ సిరీస్ ను ప్రారంభించింది.
వన్ ప్లస్ ఆవిష్కరించిన ఆ మోడల్ పేరు టర్బో సిరీస్ (oneplus Turbo series launch). ఇది 9,000 ఎంఏహెచ్ బ్యాటరీతో, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అందుబాటులోకి వచ్చింది.
ఈ బ్యాటరీని టెక్ నిపుణులు బాహుబలి తో పోల్చుతున్నారు. టర్బో 6, టర్బో 6 వీ మోడల్స్ లో 9,000 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన ఈ బ్యాటరీ కి సిలికాన్ కార్బన్ పూత ఉంది. ఇందులో 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది.
కెమెరా విషయానికి వస్తే 1.7 ఎంఎం మందం కలిగిన ఆల్ట్రా సెండ్ కెమెరా బంప్ ఉంది. ప్రత్యేక కెమెరా ఐలాండ్లో దీని రూపొందించామని వన్ ప్లస్ కంపెనీ చెబుతోంది. ప్లాస్టిక్ ఫ్రేమ్స్, బ్యాక్ ప్లేట్ తో డిజైన్ చేసినట్టు కంపెనీ నిపుణులు చెబుతున్నారు.
ఫోన్ మెరుగైన పనితీరు అనుభవాన్ని అందించడానికి క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎస్ జన్ 4 ప్రాసెసర్, టర్బో 6వీలో స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 4 ప్రాసెసర్ ఏర్పాటు చేసినట్టు వన్ ప్లస్ కంపెనీ చెబుతోంది. రెండిట్లోనూ 1.5 అమోఎల్ ఈడీ డిస్ప్లే ఉంది. టర్బో సిక్స్ లో 165 హెర్జ్ రీ ఫ్రెష్ రేట్, టర్బో సిక్స్ వీ లో 144 హెర్జ్ రీ ఫ్రెష్ రేట్ ఉంది.
ఇందులో డ్యూయల్ రియర్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 50 ఎంపీ మెయిన్, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ షూటర్ కెమెరాలు ఇందులో ఉన్నాయి. ఈ మోడల్స్ ధరపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ.. మనదేశంలో 30 వేలకు లోపే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనేది కంపెనీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.