Ram Charan: చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్… ఆ సినిమాతో ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన పాన్ రేంజ్ లో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. టైర్ వన్ హీరోగా తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు. అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో సైతం చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో చేసిన ‘రంగస్థలం’ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించిన ఆయన ఇప్పుడు మరోసారి ప్రేక్షకులందరిని ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… రామ్ చరణ్ తన కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసిన కూడా ఒక సినిమా చేసి బొక్క బోర్ల పడ్డాడు. బాలీవుడ్ లో ఒకప్పుడు అమితాబచ్చన్ చేసి సక్సెస్ సాధించిన జంజీర్ సినిమాని అదే పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమా తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజైంది.
ఈ సినిమా ఎవరిని ఆకట్టుకోకపోగా రామ్ చరణ్ పైన చాలా విమర్శలైతే వచ్చాయి. ఈ సినిమా ద్వారా ఆయన చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో రామ్ చరణ్ చాలావరకు నెగెటివ్ కామెంట్స్ ను మూట గట్టుకోవడమే కాకుండా తన మార్కెట్ కూడా భారీగా తగ్గిపోయాడనే చెప్పాలి.
అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ద్వారానే తను కెరియర్ లో ఎలాంటి సినిమాలు చేయాలి. ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారు అనేది తెలుసుకొని ట్రాక్ చేంజ్ చేసి మంచి సినిమాల వైపు తన అడుగులు వేస్తున్నాడు.
ఒకప్పుడు కమర్షియల్ సినిమాలను చేసిన ఆయన రామ్ చరణ్ తో డిఫరెంట్ అటెంప్ట్ చేయడంతో అభిమానులు సైతం అతని సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన తన తదుపరి సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు. పాన్ ఇండియా ప్రేక్షకులందరిని మెప్పించాలంటే ఇంకా ఎలాంటి సినిమాలు చేయాలి. మనం ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంలో క్లారిటీగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది…