Basmati Rice: ప్రతి రోజు ఆహారం తీసుకుంటాం. కానీ అందులో టేస్టీ ఐటమ్స్ ను కూడా గుర్తించి మరీ తింటాం. వాటికే మళ్లీ మళ్లీ తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక అన్నం తిన్నప్పుడు కూర మాత్రమే కాదు. రైస్ కూడా టేస్ట్ గా ఉండాలంటారు కొందరు. రైస్ టేస్ట్ గా ఉంటేనే తింటారు కూడా. మరి మీలో రైస్ టేస్ట్ ను ఇష్టపడి తినేవారు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారికి ఒక నెంబర్ వన్ టేస్టీ రైస్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ రైస్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ టేస్టీ రైస్.
టేస్ట్ అట్లాస్ 2023-24 మన దేశంలోని ఓ రకమైన బియ్యాన్ని ఉత్తమ బియ్యంగా గుర్తించింది. మన దేశమే బియ్యం పండించడంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. అందులోనూ మన దేశ బియ్యమే ప్రపంచంలోనే నెంబర్ వన్ బియ్యంగా నిలవడం గ్రేట్ విషయం కదా. అయితే బాస్మతి బియ్యాన్ని అత్యుత్తమ బియ్యంగా పేర్కొంది టేస్ట్ అట్లాస్. సాధారణ బియ్యం కంటే ఈ బియ్యం కాస్త భిన్నంగా ఉంటాయి. పొడవుగా, సన్నగా మాత్రమే కాదు రుచితో పాటు సువాసనకు కూడా ప్రసిద్ది చెందాయి ఈ బియ్యం.
భారతదేశంలో దాదాపు 34 రకాల వరిని సాగు చేస్తుంటారు. ఇందులో బాస్మతి 217, బాస్మతి 370, డెహ్రాడూన్ బాస్మతి, కస్తూరి బాస్మతి, పంజాబ్ బాస్మతి, మహి సుకంద, హర్యానా బాస్మతి, రణబీర్ బాస్మతి, ధరోరి బాస్మతి వంటి రకాలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్న బాస్మతి బియ్యం రకాలు.
మన దేశంలో ఎన్నో రకాల షర్బత్ లను తాగుతుంటాం. ఇందులో మామిడి కాయ షర్బత్ కూడా ఒకటి. అయితే రుచి అట్లాస్ మామిడికాయ షర్బత్ ను కూడా టేస్టీ పానీయకంగా గుర్తించింది. అంటే మన దేశంలోనే బెస్ట్ రైస్, బెస్ట్ షర్బత్ లు ఉన్నాయన్నమాట.