Laddu Competition: జనం భారీగా వచ్చారు. అందరూ గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. సంప్రదాయ ఆటల పోటీలు మాత్రమే అక్కడ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను వారు తరనేతర్ మేళా అని పిలుస్తుంటారు. ఈ పోటీలకు వచ్చిన వారంతా రైతులు, చిన్న చిన్న పనులు చేసే వారు మాత్రమే. ఆ పోటీలలో ఎవరి సామర్థ్యం మేరకు వారు రాణించారు. విజేతలకు ఇచ్చేది స్వల్ప మొత్తంలోనే అయినప్పటికీ.. పోటి మాత్రం విపరీతంగా ఉంటుంది. అయితే ఈ పోటీలో ఒక అంశం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. బహుశా ఇటువంటి పోటీ మన దేశంలోనే ఉండకపోవచ్చు.
గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్రనగర్ ప్రాంతంలో గ్రామీణ ఒలంపిక్స్ నిర్వహించడం ఎప్పటినుంచో ఉంది. సరిగ్గా నవరాత్రి వేడుకలకు ముందు ఇక్కడ ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. విజేతలకు నవరాత్రి వేడుకలు ముగిసిన తర్వాత నగదు బహుమతి అందిస్తుంటారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. కేవలం కొంతమంది తలాఇంత నగదు వేసుకొని ఈ పోటీలను నిర్వహిస్తుంటారు. గ్రామీణ స్థాయి క్రీడలతో పాటు ఇక్కడ లడ్డూలు తినే పోటీ కూడా నిర్వహిస్తుంటారు. ఇచ్చిన వ్యవధిలో ఎవరు ఎక్కువ లడ్డులు తింటే వారికి నగదు బహుమతి అందిస్తుంటారు.. ఈ పోటీలలో గడిచిన 11 సంవత్సరాలు మావ్ జీ పటేల్ గోళీ విజేతగా నిలుస్తున్నారు. ఈసారి కూడా ఆయనే విజేతగా నిలిచారు. కాకపోతే పోటీ ఎక్కువగా ఉండటంతో మరో రౌండ్ కూడా నిర్వహించాల్సి వచ్చింది.. మావ్ జీ తో పాటు మరో నలుగురు కూడా ఒకే వ్యవధిలో లడ్డూలు తిన్నారు. దీంతో మరో రౌండ్ పోటీ నిర్వహించాల్సి వచ్చింది..
30 నిమిషాలలో
మావ్ జీ రెండో రౌండ్ పోటీలో 30 నిమిషాల వ్యవధిలో 30 లడ్డులు తిని విజేతగా నిలిచారు. లడ్డూలు తినే క్రమంలో ఆయన చుక్క నీరు కూడా తాగలేదు. ఆయన ప్రత్యర్థులు ఆ స్థాయిలో లడ్డూలు తినలేకపోయారు. దీంతో మావ్ జీ విజేతగా నిలిచారు. గడిచిన 11 సంవత్సరాలుగా మావ్ జీ విజేతగా నిలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆయనే విజేతగా నిలిచారు. విజేతగా నిలిచినందుకు ఆయనకు నిర్వాహకులు 2000 రూపాయల నగదు బహుమతి అందించారు. నగదు బహుమతి స్వల్పమే అయినప్పటికీ.. ఈ పోటీలు ఉత్సాహకరంగా సాగుతూ ఉంటాయి కాబట్టి పాల్గొనడానికి చుట్టుపక్కల వారు వస్తుంటారు. ఈ పోటీలను వారు గ్రామీణ స్థాయి ఒలంపిక్స్ అని పిలుచుకుంటారు.. సంప్రదాయ గుజరాతి క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. బహుశా మన దేశ చరిత్రలో గ్రామీణ ఒలంపిక్స్ ఇక్కడ జరుగుతుంటాయి. పైగా సంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడంతో గుజరాతీయులు వీటిలో పాలు పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
View this post on Instagram