Honeycreeper : అర్ధనారీశ్వరుడు అని మనం పురాణాల్లోనే చదివాం.. ఆ పరమశివుడు తనలో సగాన్ని పార్వతికి ఇచ్చి ఈ రూపంలోకి మారారు. ఆ దేవదేవుడికే సాధ్యమైన ఈ అద్భుతం ఇప్పుడు కొలంబియాలో ఓ పక్షి రూపంలో సాక్షాత్కారమైంది. ఆ అర్ధనారీశ్వర పక్షి ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఒక కొత్త అద్భుతంగా కనిపిస్తోంది. మనలాంటి హిందుత్వవాదులకు ఇదో దైవస్వరూపంగా అగుపిస్తోంది. కొలంబియాలో వెలుగుచూసిన ఈ సగం ఆడ, సగం మగ లక్షణాలతో పుట్టిన ఈ పక్షి ఇప్పుడు వైరల్ అవుతోంది.
కొలంబియాలో పక్షి శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అరుదైన దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. ఆడ పక్షిలా సగం ఆకుపచ్చ రంగులో, మగ పక్షిలా సగం నీలం రంగులో ఇది కనిపిస్తోంది. దీన్ని గ్రీన్ హనీక్రీపర్ పక్షి అని అక్కడ అంటారు. ఇది చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. ఈ పక్షి బైలేటరల్ గైనండ్రోమోర్ఫిజం అనే జన్యుపరమైన అసాధారణ వల్ల ఇలా ఆడ, మగ లక్షణాలతో పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ సంస్కృతిలో అర్ధనారీశ్వరుడు అనే భావన ఉంది. శివుడు, పార్వతి కలయికతో అర్ధనారీశ్వరుడుగా ఆ దేవదేవుడు ఆగుపించాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపంలో ఉండే అర్ధనారీశ్వరుడిలాగా ఈ పక్షి కూడా సగం ఆడ, సగం మగ లక్షణాలను కలిగి ఉండడం విశేషం.
Also Read : చైనా యొక్క ఇంజనీరింగ్ అద్భుతం.. ఆకాశమంత ఎత్తులో వంతెన
– గైనండ్రోమోర్ఫిజం అంటే ఏమిటి?
గైనండ్రోమోర్ఫిజం అనేది జన్యుపరమైన అసాధారణ వల్ల కలుగుతుంది.. ఇది జంతువు శరీరంలో సగం మగ కణాలు, సగం ఆడ కణాలు ఉండటానికి కారణమవుతుంది. పక్షులలో ఇది ఈకల రంగు, పరిమాణం, ఆకారాన్ని ప్రభావితం చేస్తుంది. గైనండ్రోమోర్ఫిజం అనేది ఒక అసాధారణమైన జన్యుపరమైన పరిస్థితి, ఇందులో ఒక జీవి మగ, ఆడ కణాలను కలిగి ఉంటుంది. ఇది ద్వైపాక్షికంగా ఉంటే.. జీవిలో సగానికి మగ లక్షణాలు, సగానికి ఆడ లక్షణాలు కలిగి ఉంటుందన్న మాట…
పక్షులలో గైనండ్రోమోర్ఫిజం అనేది ఈకల రంగు, నమూనాలో స్పష్టంగా కనిపిస్తుంది. మగ పక్షులు సాధారణంగా ప్రకాశవంతమైన రంగులను కలిగి ఉంటాయి. అయితే ఆడ పక్షులు మరింత మ్యూట్ రంగులను కలిగి ఉంటాయి. గైనండ్రోమోర్ఫిక్ పక్షిలో ఒక వైపు మగ రంగులు, మరొక వైపు ఆడ రంగులు ఉంటాయి. అందుకే దీన్ని అర్ధనారీశ్వర పక్షి అని అంటున్నారు.
– ఈ పక్షి ఎందుకు ప్రత్యేకమైనది?
ఈ పక్షి సగం ఆడ, సగం మగ రంగులను కలిగి ఉంది. ఇది గైనండ్రోమోర్ఫిజం అనే అరుదైన జన్యుపరమైన అసాధారణతతో బాధపడుతోంది. ఇది అర్ధనారీశ్వరుడి భావనకు దగ్గరగా ఉంది. ఈ పక్షి గత 100 సంవత్సరాలలో గుర్తించబడిన రెండవ గైనండ్రోమోర్ఫిక్ గ్రీన్ హనీక్రీపర్ అని చెబుతున్నారు.. ఈ పక్షిని పరిశీలించడం ద్వారా శాస్త్రవేత్తలు పక్షులలో లైంగిక భేదం, జన్యుశాస్త్రం గురించి మరింత తెలుసుకోవచ్చు. ఈ పక్షిని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయి ప్రపంచానికి పరిచయం చేస్తూ పరిశోధనలు చేస్తున్నారు. ఇది ప్రకృతిలో ఎంత వైవిధ్యం ఉందో తెలియజేస్తుంది. ఇదొక జన్యుపరమైన అద్భుతంగా చెప్పుకోవచ్చు.