Central government scheme : భారత్ లోని యువత ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో కొత్త స్కీం ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం ద్వారా దేశంలోని యువకులకు నైపుణ్యం శిక్షణ ఇచ్చి వారిని ప్రయోజనకులను చేస్తుంది. ఇందుకోసం దేశంలోని దాదాపు 500 కంపెనీలు ఇందులో పాలు పంచుకోనున్నాయి. ఈ పథకంలో చేరేందుకు భారతీయులు ఎవరైనా అర్హులే. అలాగే 21 నుంచి 24 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పథకంలో చేరాలంటే మార్చి 31 వరకే గడువు విధించారు. అయితే మరింత మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ గడువును మరోసారి పెంచారు. మరి ఎప్పటి వరకు దీనిని అప్లై చేసుకోవాలంటే?
కేంద్ర బడ్జెట్ 2024-2025 ఆర్థిక బడ్జెట్ లో PM Internship Scheme ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఏడాదిపాటు దేశంలోని టాప్ 500 కంపెనీలతో యువకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ఉద్యోగాలు లేదా ఉపాధి పొందేందుకు ఈ శిక్షణ ఉపయోగపడనుంది. ఆ తరువాత వారు తమ సొంత నైపుణ్యాలతో టాప్ కంపెనీల్లో ఉద్యోగాలను కూడా పొందేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో భారీగా ఆదాయం పొందేందుకు కూడా ఛాన్స్ ఉంది.
Also Read : కేంద్రం సూపర్ స్కీమ్.. అమ్మాయి పుడితే రెండో కాన్పులో డబ్బులు పొందే ఛాన్స్!
పీఎం ఇంటర్న్ షిప్ పథకంలో చేరిన వారికి స్టైఫండ్ కింద నెలకు రూ.5వేలు అందిస్తారు. ఇలా ఏడాది పాటు మొత్తంగా రూ.60,000తో పాటు మరోనెల గ్రాంట్ కింద రూ.6,000 అందిస్తారు. అంటే మొత్తంగా ఏడాదికి రూ.66,000 అందిస్తారు. మొత్తం ఏడాది పాటు తీసుకునే శిక్షణలో సగం కాలం శిక్షణ ఉంటుంది. మిగతా సగం కాలం కంపెనీల్లో ట్రైనింగ్ ఉంటుంది. ఈ పథకంలో చేరిన వారికి పీఎం జీవన జ్యోతి బీమా వర్తిస్తుంది. అలాగే పీఎం సురక్ష బీమాకు కూడా అవకాశం ఉంటుంది.
ఈ పథకం గడువుపు ఏప్రిల్ 22 వరకు గడువు పెంచారు. భారతీయులు అయి ఉండి 24 ఏళ్ల లోపు యువకు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10 వ తరగతి పూర్తి చేసిన వారి నుంచి ఆ పై తరగతులు చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తును ఆన్ లైన్ లో లేదా దీనికి సంబంధించిన యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈ యాప్ లో కన్సల్టెంట్ అధికారులు అందుబాటులో ఉంటారు. వీరు ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను అందిస్తారు.
10 వ తరగతి పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం అని నిపుణులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో టాప్ కంపెనీల నుంచి నిపుణులు యువతకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల భవిష్యత్ మంచి లైఫ్ ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలనే యువకులు ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.
Also Read : చంద్రబాబు టార్గెట్ 2029.. మోదీ, పవన్ దోస్తీ కోసం ఆరాటం!