Homeవింతలు-విశేషాలుJapan metro journey viral video: జపాన్ లో మెట్రో ప్రయాణం.. పెట్టి పుట్టాలి.. ఈ...

Japan metro journey viral video: జపాన్ లో మెట్రో ప్రయాణం.. పెట్టి పుట్టాలి.. ఈ వీడియో చూడండి

Japan metro journey viral video: నగరాలు పెరుగుతున్న నేపథ్యంలో.. జనాభా అవసరాలు అధికమవుతున్న నేపథ్యంలో.. కాలుష్యాన్ని నివారించడానికి మెట్రో రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రపంచంలో అతిపెద్ద నగరాలలో మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో భూగర్భ మెట్రో ఉంటే.. మరి కొన్ని ప్రాంతాలలో వంతెనలు నిర్మించి.. వాటి మీదుగా మెట్రో రైలు సేవలు నిర్వహిస్తున్నారు… మనదేశంలో పెద్దపెద్ద నగరాలలో మెట్రో రైలు సేవలు కొనసాగుతున్నాయి. మెట్రో రైలు లో వేగంగా ప్రయాణం మాత్రమే […]

Japan metro journey viral video: నగరాలు పెరుగుతున్న నేపథ్యంలో.. జనాభా అవసరాలు అధికమవుతున్న నేపథ్యంలో.. కాలుష్యాన్ని నివారించడానికి మెట్రో రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రపంచంలో అతిపెద్ద నగరాలలో మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో భూగర్భ మెట్రో ఉంటే.. మరి కొన్ని ప్రాంతాలలో వంతెనలు నిర్మించి.. వాటి మీదుగా మెట్రో రైలు సేవలు నిర్వహిస్తున్నారు…

మనదేశంలో పెద్దపెద్ద నగరాలలో మెట్రో రైలు సేవలు కొనసాగుతున్నాయి. మెట్రో రైలు లో వేగంగా ప్రయాణం మాత్రమే కాకుండా.. ట్రాఫిక్ రద్దీ లేకుండా వెళ్ళిపోవచ్చు. పైగా ఏసి సదుపాయం కూడా ఉంటుంది. ఆయా ప్రాంతాలలో ప్రయాణికుల రద్దీ ఆధారంగా టికెట్ ధరలు ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం పాస్ లు కూడా మెట్రో కల్పిస్తూ ఉంటుంది.. మనదేశంలో ఢిల్లీ నుంచి మొదలుపెడితే హైదరాబాద్ వరకు ప్రతి మెట్రో కూడా రద్దీగా ఉంటుంది. ఉదయం నుంచి మొదలు పెడితే రాత్రి వరకు ఈ సర్వీసులు కొనసాగుతూనే ఉంటాయి.

ఇక ప్రపంచంలో బుల్లెట్ ట్రైన్ లకు ప్రసిద్ధిగాంచిన జపాన్లో.. మెట్రో సేవలు కూడా విస్తృతంగా ఉంటాయి. జపాన్ రాజధాని టోక్యోలో మెట్రో అత్యంత రద్దీగా ఉంటుంది. ప్రతిరోజు దాదాపు 64 లక్షల మంది దీనిని ఉపయోగిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి స్టేషన్ కూడా రద్దీగానే ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రయాణికులు నిలబడి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక్కోసారి డోర్లు కూడా మూసుకో లేనంతగా ప్రయాణికులు ఉంటారు. అలాంటప్పుడు వారిని లోపలికి నెట్టడానికి పుషర్స్ ఉంటారు.

ఇంత రద్దీగా ఉన్నప్పటికీ ఈ ఒక్క రైలు కూడా సెకండ్ కూడా ఆలస్యంగా నడవదు. శుభ్రతకు జపాన్ దేశస్తులు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. టోక్యో మెట్రో కూడా అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది. అక్కడ డస్ట్ బిన్లు బయో డిస్పోజల్ మెథడ్ లో పనిచేస్తుంటాయి.. ఘన, ద్రవ వ్యర్ధాలను ఉపయోగించి విద్యుత్ తయారు చేస్తారు. డ్రైనేజీ కూడా భూగర్భం నుంచి ఉంటుంది. ఫలితంగా దుర్వాసన ఉండదు. దోమలు, ఈగలు వంటివి కనిపించవు.

జపాన్ దేశస్థుల లో సివిక్ సెన్స్ అధికంగా ఉంటుంది. అందువల్ల వారు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. టోక్యో మెట్రో కూడా అత్యంత పరిశుభ్రంగా ఉండడానికి ప్రధాన కారణం అక్కడి ప్రజల వ్యవహార శైలి. ప్రపంచంలో న్యూయార్క్ నుంచి మొదలుపెడితే న్యూఢిల్లీ వరకు ఉన్న మెట్రోలో రద్దీ వాతావరణం ఏర్పడితే రైళ్లు కాస్త ఆలస్యంగా నడుస్తాయి. కానీ టోక్యోలో అలా ఉండదు. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే రైలు వ్యవస్థ అయినప్పటికీ.. సెకండ్ కూడా ఆలస్యంగా రైళ్లు నడవవు. దీనిని బట్టి అక్కడ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper