Albatross Bird: పక్షులు అన్నాక ఆకాశంలో విహరిస్తుంటాయి. ఆహారాన్ని సేకరిస్తుంటాయి. చెట్ల కొమ్మల మధ్య గూళ్ళు నిర్మించుకుంటాయి. ఇతను సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. తాము ఉన్నచోట ఆహారం లభించకపోతే.. ఆహారం కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లిపోతుంటాయి.
కొన్ని పక్షులు మాత్రం విభిన్న తత్వాన్ని అనుసరిస్తుంటాయి. భౌగోళిక వ్యవస్థకు అనుకూలంగా ప్రయాణం సాగిస్తున్నప్పటికీ.. కొన్ని సందర్భాలలో మాత్రం అవి మిగతా వాటితో పోల్చితే విచిత్రంగా ఉంటాయి. విభిన్నంగా కనిపిస్తుంటాయి. ఇటువంటి జాబితాలో ఈ పక్షి మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పక్షి మామూలుది కాదు. దీని పుట్టుక నుంచి ఎదగడం వరకు.. జీవించడం వరకు అంతా ప్రత్యేకమే.
ఈ పక్షి పేరు ఆల్బత్రోజ్. ఇది సముద్రంపై ఎగురుతూ ఉంటుంది. ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది. అలాగని నేలమీద వాలిపోకుండా ఏకంగా ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది గాల్లోనే నిద్రపోతూ ఉంటుంది. ఈ పక్ష రెక్కలు దాదాపు 12 అడుగుల వరకు ఉంటాయి. వాటితో విహరిస్తూ.. ఆకాశంలో తేలిపోతూ ఉంటుంది. ఐదు మైళ్ళ ఎత్తునుంచే సముద్రంలో ఉన్న ఆహారాన్ని పసిగడుతుంది. దాదాపు 50 సంవత్సరాలు వరకు జీవిస్తుంది.
ఈ పక్షులు ఆడ, మగ కలిసి జీవిత చరమాంకం వరకు ఉంటాయి. సంతాన ఉత్పత్తి కోసం మాత్రమే ఈ పక్షి భూమి మీదకి దిగుతుంది. ఆ తర్వాత గుడ్లు పెట్టి.. పొదిగి.. పిల్లల్ని కన్న తర్వాత మళ్లీ పైకి ఎగురుతుంది. కలయిక సమయంలో కూడా ఈ పక్షి కిందికి వస్తుంది. ఈ పక్షి ఒక్కరోజులోనే 500 మైళ్ళ వరకు ప్రయాణం చేస్తుంది. తన జీవితకాలంలో 70 శాతానికి మించిన సమయాన్ని ఆకాశంలోనే గడుపుతుంది. ఈ పక్షి ప్రమాదాన్ని ముందుగానే పసిగడుతుంది. అందువల్లే సాధ్యమైనంతవరకు స్వీయ రక్షణ విధానాన్ని పాటిస్తూ ఉంటుంది. ఆహారం తీసుకునే విషయంలో కూడా ఈ పక్షి విభిన్న తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో శాకాహారాన్ని.. మరి కొన్ని సందర్భాలలో మాంసాహారాన్ని తీసుకుంటుంది. అయితే ఆకలిగా ఉంటే మాత్రమే ఈ పక్షి ఆహార అన్వేషణ చేపడుతుంది.