Mahesh Babu And Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్… ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలను చేసిన ఘనత అతనికే దక్కింది. ప్రతి ఒక్కరికి సక్సెస్ లను అందించడమే కాకుండా ఆ హీరోలకు కొత్త క్యారెక్టరైజేషన్ ను క్రియేట్ చేయడంలో ఆయన తన వంతు ప్రయత్నం చేశాడు. అలాంటి పూరి జగన్నాధ్ మహేష్ బాబుతో పోకిరి సినిమా చేసే సమయంలో కృష్ణవంశీ మహేష్ బాబు ను మిల్క్ బాయ్ అంటూ సంభోదించారట… కానీ పూరి మాత్రం ఆ మాటతో విభేదిస్తూ మనం కావాలని ఆయన్ని మిల్క్ బాయ్ అంటూ ఆయన చేత సాప్ట్ సినిమాలు చేయిస్తున్నాం. ఆయన ఒక మాస్ సినిమా చేస్తే దానికి ఉండే రేంజ్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాడట.
అప్పుడే పోకిరి సినిమా కథని మహేష్ బాబుకు చెప్పి తనను ఒప్పించి మొత్తానికైతే ఆ సినిమాను చేశాడు. పోకిరి సినిమాతోనే మహేష్ బాబు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆ మూవీ తో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న ఆయన అప్పటినుంచి వరుసగా మాస్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.
మొత్తానికైతే మహేష్ బాబు మిల్క్ బాయ్ లా కనిపిస్తాడు కానీ ఆయనలో మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయని ప్రూవ్ చేసిన దర్శకుడు మాత్రం పూరి జగన్నాధ్ అంటూ చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక పోకిరి సినిమా తర్వాత విల్లా కాంబోలో బిజినెస్ మేన్ సినిమా వచ్చింది. మొత్తానికైతే ఈ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని సాధించిన వీళ్ళు మరోసారి జతకడితే బాగుండని వాళ్ల అభిమానులు కోరుకున్నప్పటికి అది సాధ్యపడలేదు.
ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా మహేష్ బాబు కెరియర్ లోనే మాస్టర్ పీస్ సినిమాలు గా మిగిలిపోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ప్రస్తుతం మహేష్ బాబు మాత్రం వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ను సాధించాలని తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…
