The Odyssey Movie Collections: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాలా సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే… కృష్ణోఫర్ నోలన్ డైరెక్షన్లో వచ్చిన సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఆయనకు ప్రపంచ స్థాయిలో చాలామంది అభిమానులు ఉన్నారు. ప్రతి సినిమాతో డిఫరెంట్ అటెంప్ట్ ని ప్రయత్నం చేస్తున్న ఆయన ప్రతి సినిమాతో ప్రేక్షకులను మెప్పించగలుగుతున్నాడు. డిఫరెంట్ అటెంప్ట్ లతో ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఆయన చేసిన ‘ది ఒడిస్సీ’ అనే సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఇండియాలో చాలా మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమా మొదటి రోజే ఇండియాలో 20 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది.
నిజానికి 30 కోట్ల వరకు ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తాయని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకున్న దానికంటే చాలా వరకు తక్కువ కలెక్షన్స్ రావడం అనేది కొంతవరకు నిరుత్సాహాన్ని వ్యక్తం చేసే విషయమనే చెప్పాలి. కారణం ఏదైనా కూడా ఒక హాలీవుడ్ సినిమా తెలుగులో ఇంత భారీ బజ్ ను క్రియేట్ చేసి 20 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఈ విషయంలో నోలన్ సైతం కొంతవరకు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇండియాలో తన సినిమాలకు ఎక్కువగా ఆదరణ ఉంటుందని తెలుసు కానీ 20 కోట్లు కలెక్షన్స్ రావడం అనేది నిజంగా చాలా మంచి విషయం అనే అభిప్రాయాన్ని తను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మొత్తానికైతే రాజమౌళి లాంటి దర్శకుడు ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తుంటే నోలన్ మాత్రం ఇండియాలో తన సినిమాకి భారీ కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నారు. మొత్తానికైతే రాజమౌళి సినిమాల్లో వాడే టెక్నాలజీ సైతం క్రిస్టోఫర్ నోలన్ సినిమాల్లో నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నవే కావడం విశేషం…
