Telegraph Rock: ప్రమాదం అంచున ఫొటోలు దిగాలనుకుంటున్నారా.. అయితే అక్కడకు వెళ్లాల్సిందే.. క్యూ కడుతున్న పర్యాటకులు!

బ్రెజిల్‌లోని రియోడి జెనీరోలో ఉన్న టెలిగ్రాఫ్‌ రాక్‌ ఉంది. కొండకు ఒక పక్కకు ఒరిగి ఉండే రాయిపై తేలియాడుతూ పర్యాటకులు ఇక్కడ ఫొటోలు దిగుతున్నారు. ఇందుకోసం టెలిగ్రాఫ్‌ రాక్‌కు క్యూ కడుతున్నారు. తేలియాడుతూ ఫొటోలు దిగేందుకు విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : July 8, 2024 11:27 am

Telegraph Rock

Follow us on

Telegraph Rock: ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వచ్చాక ఫొటోలు, రీల్స్‌ చేయడం చాలా మందికి హామీగా మారింది. అందమైన దృశ్యాలను కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇక యువత, మహిళలు అయితే అందమైన లొకేషన్లలో రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో లైక్స్, షేర్లు పొందుతున్నారు. కొందరు ప్రమాదకర ఫీట్లతో రీల్స్‌ చేయడం, ప్రమాదపు అంచున ఫొటోలు దిగడం చేస్తున్నారు. ఇలా సాహసం చేయడం వలన ఎక్కువ లైక్స్, షేర్స్‌ వస్తాయని భావిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి లొకేషనే పర్యాటకులను తెగ ఆకర్షిస్తోంది. మరి అది ఎక్కడ ఉంది.. ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందాం.

బ్రెజిల్‌లో టెలిగ్రాఫ్‌ రాక్‌..
బ్రెజిల్‌లోని రియోడి జెనీరోలో ఉన్న టెలిగ్రాఫ్‌ రాక్‌ ఉంది. కొండకు ఒక పక్కకు ఒరిగి ఉండే రాయిపై తేలియాడుతూ పర్యాటకులు ఇక్కడ ఫొటోలు దిగుతున్నారు. ఇందుకోసం టెలిగ్రాఫ్‌ రాక్‌కు క్యూ కడుతున్నారు. తేలియాడుతూ ఫొటోలు దిగేందుకు విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రచారం..
ఇక్కడికి వచ్చి ఫొటోలు దిగిన వారు వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంలో అవి నెటిజన్లను, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ టెలిగ్రాఫ్‌ రాక్‌ ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడకు వస్తున్నారు. యువత నుంచి 50 ఏళ్ల వయసు వారు కూడా ఇక్కడకు వచ్చి ఫొటోలు దిగుతున్నారు. వందల అడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ భయపడడం లేదు.

1.5 కిమీ కొండ ఎక్కాల్సిందే..
ఇక టెలిగ్రాఫ్‌ రాక్‌కు చేరుకోవాలంటే.. సుమారు 1.5 కిలోమీటర్ల కొండ ఎక్కాల్సిందే. అయినా పర్యటకులు లెక్క చేయడం లేదు. సమూహాలుగా ఇక్కడకు వచ్చి టెలిగ్రాఫ్‌ రాక్‌ వద్ద గాల్లో తేలియాడుతూ ఫొటోలు దిగుతూ ప్రకృతి ఒడిలో ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రమాదకరంగా కనిపిస్తున్నా తమకు భయం కలగడం లేదని పర్యాటకులు చెబుతున్నారు. అయితే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

2013 నుంచి ఫొటోలు..
టెలిగ్రాఫ్‌ రాక్‌ వద్ద ఫొటోలు దిగడం 2013 నుంచే మొదలైంది. ఇక్కడ దిగిన వారు ఫొటోలను స్నేహితులు, బంధువులకు పంపేవారు. వారు కూడా ఇక్కడకు వచ్చి ఫొటోలు దిగేవారు. తర్వాత సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడంలో టెలిగ్రాఫ్‌ రాక్‌కు ఎక్కువ ప్రాచుర్యం దక్కింది.