https://oktelugu.com/

Serial Actress Lahari: బుల్లితెర నటి లహరి కొన్న ఖరీదైన కారు ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు…

Serial Actress Lahari: ఇటీవలే లహరి అటు బుల్లితెర మీద కానీ ఇటు వెండి తెర మీద కానీ పెద్దగా కనిపించటం లేదు.గీతాంజలి సీరియల్ లో కూడా నటించిన లహరి గత ఏడాది నుంచి షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లహరి ప్రస్తుతం తన బిడ్డను చూసుకునే పనిలో బిజీ గా ఉంటుంది.

Written By: , Updated On : July 8, 2024 / 11:29 AM IST
Lahari Bought Benz E Class Sedan Car

Lahari Bought Benz E Class Sedan Car

Follow us on

Serial Actress Lahari: మొగలిరేకులు సీరియల్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న బుల్లితెర నటి లహరి.తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మొగలిరేకులు సీరియల్ తర్వాత గృహలక్ష్మి సీరియల్ లో కూడా నటించి ఈమె తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.వెండి తెర మీద కూడా చిన్న చిన్న పాత్రలలో నటించి మెప్పించింది.

అయితే ఇటీవలే లహరి అటు బుల్లితెర మీద కానీ ఇటు వెండి తెర మీద కానీ పెద్దగా కనిపించటం లేదు.గీతాంజలి సీరియల్ లో కూడా నటించిన లహరి గత ఏడాది నుంచి షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లహరి ప్రస్తుతం తన బిడ్డను చూసుకునే పనిలో బిజీ గా ఉంటుంది.ప్రస్తుతం లహరి సినిమాలలో,సీరియల్స్ లలో నటించకపోయిన సోషల్ మీడియా లో మాత్రం ఆక్టివ్ గా ఉంటుంది.

ఫన్నీ రీల్స్,డాన్స్ వీడియోలు,గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె మంచి పాపులారిటీని దక్కించుకుంది.తాజాగా లహరి ఖరీదైన బెంజ్ ఈ-క్లాస్ కారును కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.తన భర్త,బిడ్డతో కలిసి కొత్త కారుతో దిగిన కొన్ని ఫోటోలను తన ఖాతాలో షేర్ చేసింది లహరి.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూసి నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు.

లహరి కి కొత్త కారు కొన్నందుకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.అయితే ఈమె కొన్న కారు ధర రూ.80 లక్షలు ఉంటుందని,మిగిలిన ఖర్చులతో కలిపి రూ.కోటి పైగా అయి ఉంటుంది అని సమాచారం.అయితే సినిమా నటుల కంటే బుల్లితెర నటులు ఒక వైపు సీరియల్స్ చేస్తూ మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు.ఇక ఈ క్రమంలోనే బుల్లితెర నటులు కొత్త కారులు,ఇల్లు కొంటున్నారు.