Subarnarekha River: మనదేశంలో బంగారం ప్రవహించే ఒక నది ఉంది. నిత్యం ఆ నదిలో బంగారం రేణువులు ప్రవహిస్తుంటాయి. అవి దాన్యం, బియ్యం గింజల కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు వాటిని సేకరిస్తుంటారు. మీరు చదివింది నిజమే. అది కూడా మన దేశంలోనే. ఆశ్చర్యపోతున్నారు కదా? అయితే అది ముమ్మాటికీ నిజమే. అది ఎక్కడ ఉన్నదో తెలుసా జార్ఖండ్ లో.. దాని పేరేంటో తెలుసా? సుబర్ణరేఖ నది.
జార్ఖండ్లో పుట్టిన ఈ నది ఒడిస్సా వైపు ప్రవహిస్తుంది. మధ్యలో పశ్చిమ బెంగాల్ ను టచ్ చేస్తుంది. దాదాపు 474 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ నదిలో టన్నుల కొద్ది బంగారం దాగుంది. ఈ ప్రాంతంలో నివసించే స్థానికులకుతెలుసు కానీ.. మిగతా వారికి ఇది షాకింగ్ విషయమే. ఈ నదిలో నీటి ద్వారా వచ్చే బంగారు రేణువులను ఆ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు వెలికి తీసి.. వాటితో తమ జీవనోపాధిని సాగిస్తుంటారు. ఆ రేణువులను జల్లెడ పడుతుంటారు. అయితే ఇలా వస్తున్న బంగారు రేణువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గని ఎక్కడ ఉందో అంతు చిక్కకుండా ఉంది. అయితే బంగారం తో కూడిన రాళ్లపై నీరు ప్రవహిస్తుంది కాబట్టి.. బంగారు రేణువులు నదిలో ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. కానీ దీనికి నిర్దిష్టమైన అంశాలను జోడించలేకపోతున్నారు.
2012లో కేంద్ర ప్రభుత్వం 2 సంస్థలకు అధ్యయన బాధ్యతలు అప్పగించింది. ఏళ్ల తరబడి అధ్యయనాలు చేసినా..నది ప్రవహిస్తున్న గుండా ఎలాంటి గని కనుక్కోలేకపోయారు. కాగా వర్షాకాలం తప్పితే మిగిలిన అన్ని కాలాల్లోనూ ఆ ప్రాంత ప్రజలు నదిలో ఇసుకను జల్లెడ పట్టి బంగారాన్ని వెలికి తీస్తారు. అయితే ఇలా దొరికే బంగారం ధాన్యం, బియ్యం కంటే చిన్న సైజు ఉంటుంది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నదిలో బంగారం సేకరణ పై ఆంక్షలు విధించినా ప్రజలు మాత్రం పట్టించుకోవట్లేదు.