Lithium Discovery in India: మనం రోజు వాడే మొబైల్ ఫోన్.. కొన్ని రకాల కంప్యూటర్లు.. కొన్ని రకాల టెక్నాలజీని వినియోగిస్తున్నామంటే.. అందుకు కారణం చైనా అని కొందరు అంటూ ఉంటారు. ఎందుకంటే చైనా దేశంలో భారీగా లిథియం నిలువలు ఉన్నందున 80 శాతం వరకు ఆ దేశం పైనే భారత్ ఆధార పడాల్సి వస్తుంది. దీంతో భారత్ పై చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే ఈ చైనా ఆధిపత్యానికి ఇక చెక్ పడినట్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్‌లోనూ ఇప్పుడు లిథియం నిల్వలు కనుగొనబడ్డాయి. ఇవి భారతదేశానికి అవసరమయ్యే వస్తువులను తయారు చేయడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. మరి ఈ లిథియం నిల్వలు ఎక్కడ ఉన్నాయంటే?
Also Read: వర్షాకాలంలో టూర్ ఎక్కడికి బెటర్..చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే!
2023 మే నెలలో రాజస్థాన్ రాష్ట్రంలో భారీగా లిథియం నిల్వలు ఉన్నట్లు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైనింగ్ అధికారులు తెలిపారు. ఈ రాష్ట్రంలోని డే గాన అనే ప్రాంతంలో రెన్వాథ్ కొండ ప్రాంతంలో వీటిని కనుగొన్నట్లు తెలిపారు. ఈ నిల్వలతో దేశ అవసరాలు తీరే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న చైనా ఆధిపత్యానికి కూడా చెక్ పెట్టే అవకాశం ఉందని తెలిపారు.
ప్రస్తుత కాలంలో రోజురోజుకు టెక్నాలజీ అవసరం పెరిగిపోతుంది. ప్రతి రంగంలో సాంకేతికత ఎంట్రీ ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరమయ్యే ఛాన్స్ ఉంది. అయితే వీటిని తయారు చేయడానికి ఎక్కువగా లిథియంను వాడుతారు. ముఖ్యంగా మొబైల్ వాడకం పెరిగిపోతున్నందున అందులో ఉపయోగించే బ్యాటరీని వాడడానికి లిథియంను ఎక్కువగా వాడుతారు. అలాగే మిగతా వస్తువులను తయారు చేయడానికి దీనిని ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇక మానసికంగా చికిత్సను అందించే సమయంలో లిథియం కూడా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. అందువల్ల ఇకనుంచి లిథియంను సొంతంగానే తయారు చేసుకోవచ్చు.
మిగతా లోహాల కంటే లిథియంను ఎక్కువగా అవసరాలకు ఉపయోగిస్తారు. ఇవి కేవలం ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో మాత్రమే కాకుండా వాహనాల తయారీలో కూడా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా పవర్ ను అందించే బ్యాటరీలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రపంచంలో చాలా దేశాలలో లిథియం లభ్యం అవుతోంది. కానీ మన దేశంలో రాజస్థాన్‌లో ఏర్పడిన నిలువలు అంతకంటే ఎక్కువగా ఉన్నాయని మైనింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ నిల్వలతో సొంతంగా వస్తువులను తయారు చేసుకోవడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.
Also Read: రూపాయి కన్నా ముందు అసలు ఏం ఉన్నాయి? ఆ నాణేలపై స్పెషల్ స్టోరీ
కొన్ని వస్తువుల విషయంలో భారత్‌లో చైనా అదే ఆధిపత్యం గా ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు చైనావి ఎక్కువగా వాడుతున్నారు. భారత్ ఫోన్ల కంటే చైనా ఫోన్లు తక్కువ ధరకు అందిస్తూ భారత్ మార్కెట్‌ను దెబ్బతీస్తోంది. కానీ ఇప్పుడు చైనా ను అడ్డుకునేందుకు అవకాశం వచ్చింది. సొంతంగా అవసరానికి మొబైల్ ఫోన్లే కాకుండా ఎన్నో రకాల వస్తువులను తయారు చేసి ఉపయోగించుకోవచ్చు.