Puri Jagannadh Chiranjeevi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిలబెట్టాయి. ప్రస్తుతం ఆయన ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నాడు. ఇక దీంతో పాటుగా వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర (Vishwam bhara) సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది… ఇలాంటి నేపథ్యంలోనే ఆయన ఇకమీదట కూడా చాలా తొందరగా సినిమాలను చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే స్వతహాగా చిరంజీవి అభిమాని అయిన పూరి జగన్నాథ్ చిరంజీవితో ఒక సినిమా చేయడానికి చాలా రోజుల నుంచి సన్నాహాలు చేస్తున్నాడు. కానీ వీళ్ళ కాంబినేషన్ మాత్రం సెట్ అవ్వడం లేదు కారణం ఏంటి అంటే పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఫామ్ లో లేడు. అందువల్లే చిరంజీవి అతన్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే పూరి చెప్పిన కథని సైతం చిరంజీవి నమ్మలేకపోతున్నాడు. అందువల్లే ఆయన పూరి జగన్నాధ్ ను పక్కన పెడుతున్నట్టుగా తెలుస్తోంది… మరి మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం ఆ సినిమా మంచి గుర్తింపును సంపాదించుకుంటుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read: మెగాస్టార్ చిరంజీవి ప్లేస్ ను భర్తీ చేసే హీరో ఎవరో తెలిసిపోయిందా..?
మరి పూరి జగన్నాథ్ ఒక సక్సెస్ ని సాధించి ఆ తర్వాత చిరంజీవికి కథ చెప్తే ఆయన ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఇప్పుడున్న సిచువేషన్ ను బట్టి చూస్తే ఆయన యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వాళ్లైతే ఈ జనరేషన్ కి తగ్గట్టుగా చూపించే ప్రయత్నం చేస్తారు.
కాబట్టి వాళ్లతో సినిమాలు చేస్తేనే తనకు ఒక కొత్త ఇమేజ్ వస్తుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలను చేసి సక్సెస్ లను సాధించి పెడతారనే ఉద్దేశ్యంతో వాళ్లకు అవకాశాలను ఇస్తున్నాడు. మరి పూరి జగన్నాథ్ సైతం గత కొద్ది రోజుల నుంచి తన పూర్తి ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. కాబట్టి చిరంజీవి సైతం ఆయన్ని పక్కన పెట్టేసాడు…
Also Read: అందరు మాస్ డైరెక్టర్లు అవ్వలేరా..?ఇది తెలుసుకుంటే ప్లాప్ సినిమాలు రావా..?
మరి వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని అటు పూరి అభిమానులు, ఇటు చిరంజీవి అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ కాంబినేషన్ ఫ్యూచర్ లో వస్తే బాగుంటుంది. కానీ వచ్చే అవకాశాలైతే చాలా తక్కువ అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…