Monsoon Travel Destinations: వేసవి సెలవులు రాగానే చాలామంది విహారయాత్రలకు వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా ఈ కాలంలో పాఠశాలలకు సెలవులు ఉండడంతో దూర ప్రాంతాల్లోకి వెళ్లి ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అయితే వేసవిలో కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఒక్కోసారి అనుకున్నంతగా ఎంజాయ్మెంట్ ఉండదు. ఇలాంటప్పుడు చల్లగా ఉండే వర్షాకాలంలో ప్రయాణాలు చేయడం మంచిది. అయితే వర్షాకాలంలోనూ కొన్ని ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అధిక వరదలు, ఇతర సమస్యల కారణంగా ప్రయాణాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కానీ కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఈ సమస్యలు ఉండవు. ఇక్కడ వాతావరణం చల్లగా ఉండి హాయిని గొలుపుతుంది. మరి అలాంటి ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందామా..
Also Read: ఉద్యోగులు కార్యాలయాల్లో ఎలా పనిచేస్తే డెవలప్ అవుతారు?
వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది.. ఇదే సమయంలో పచ్చని నేలను చూస్తే ఎంతో హాయిగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశాన్ని చూడాలంటే కేరళలోని మున్నార్, అలెప్పి ఆకర్షిస్తాయి. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ టీ గార్డెన్, కొండలు, జలపాతాలు ఇక్కడ అద్భుతాన్ని ఇస్తాయి. ఈ రాష్ట్రంలో ఉన్న బృందావన్ గార్డెన్ వర్షాకాలంలో వెళ్లడం వల్ల ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని ర్యాలీ ఆఫ్ లవర్స్ మాన్సూన్ లో అద్భుతంగా కనిపిస్తుంది. ఇది యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశం. ఇలాంటి సమయంలో ఇక్కడ పచ్చిక బయలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. చిరుత, గోధుమ ఎలుగుబంటి, నీలి గొర్రెలు వంటివి ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ ప్రదేశంలో ఆల్బైన్ పూలు వికసిస్తాయి. ఇవి ఎంతో ప్రసిద్ధి చెందినవి. సెప్టెంబర్ లోగా ఇక్కడికి వెళ్లడం ఉత్తమం.
రాజస్థాన్లోని ఉదయపూర్ ను సరస్సుల నగరం అని పిలుస్తారు. ఇక్కడ సిటీ ప్యాలెస్, లేక్ పిచోలా, సజ్జన్గడ్ ప్యాలెస్, సహేలియోన్ కి భారీ అనే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ పిచోలా అనే సరస్సు ఒడ్డున అతిపెద్ద ప్యాలెస్ ఉంటుంది. ఇందులో పురాతన వస్తువులు కూడా ఉంటాయి. సాధారణంగా వేసవిలో ఇక్కడికి రావడం వల్ల అధిక ఉష్ణోగ్రతతో ఇబ్బందులు పడతారు. అయితే వర్షాకాలంలో ఇక్కడికి పర్యటన చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే చరిత్ర కలిగిన వస్తువులను కూడా తెలుసుకోవచ్చు.
Also Read: భూమిపై అత్యంత పెద్ద చెట్లు ఇవే..!
తమిళనాడు రాష్ట్రంలోని కొడైకెనాల్, ఊటీ, మహాబలిపురం వంటి ప్రదేశాలను వర్షాకాలంలో సందర్శించవచ్చు. కొడైకెనాల్ లో వేసవిలోనూ చల్లటి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. కానీ వర్షాకాలంలో మరింత ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతారు. అలాగే మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి, హిమాచల్ ప్రదేశ్ లోని నొక అనే గ్రామానికి వెళ్లి ఆనందంగా ఉండవచ్చు. వీటిలో కొన్ని ప్రదేశాలను స్నేహితులతో.. మరికొన్ని ప్రదేశాలను కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడపవచ్చు. అయితే అధిక వర్షాలు కురుస్తున్న సమయంలో కొండలు వంటి ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది.