Camels eat Snakes : ఒంటెలకు పాములను ఎందుకు ఆహారంగా తింటాయో.. తెలిస్తే మీరు షాక్ అవుతారు

పాములో ఉన్న విషం ఒంటె ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుందట. అందుకే బతికున్న పాములను ఒంటెలకు ఆహారంగా ఇస్తారు. అయితే అన్ని సందర్భాల్లో అందరూ దీనిని ఉపయోగించరు. శుష్క ప్రాంతాల్లో చాలామంది తమ పశువులను రక్షించుకోవడానికి ఇలా ప్రయత్నిస్తారు.

Written By: NARESH, Updated On : August 18, 2024 10:45 pm

Why camels eat Snakes

Follow us on

Camels eat Snakes : సాధారణంగా పాములు చనిపోయిన వాటినే కాకుండా బతికున్న వాటిని కూడా తింటాయి. ఉదాహరణకు మనుషులు, కప్పలు ఇలా కొన్నింటిని తింటాయి. అయితే కేవలం పాము మాత్రమే బతుకున్న జీవులను తినకుండా ఒంటెలు కూడా తింటాయి. ఇవ అయితే ఏకంగా పాములను తింటాయి. అసలు ఒంటెలు బతికున్న పాములను తింటాయనే విషయం మీకు అసలు తెలుసా? పాములు విషపదార్థం. వీటిని తినడం వల్ల చనిపోతామని అందరూ భావిస్తారు. కానీ బతికున్న పాములను తినడం వల్ల ఒంటెల ఆరోగ్యానికి మంచిదట. సాధారణంగా చనిపోయిన జీవులను వేరేవి తినవచ్చు. కానీ బతికున్న పాములనే ఒంటెలు తినడం వెనుక ఏదైనా సైంటిఫిక్ రిజన్ ఉందా? అనే డౌట్ మనలో చాలామందికి ఉంది. బతికున్న పాములను ఒంటెలు తినడం వల్ల వాటి ఆరోగ్యం బాగుపడుతుందని సమాచారం. ఇలాంటి పాములను తినడం వల్ల ఒంటెల్లో హెమరేజిక్ వ్యాధి నయం అవుతుంది. సజీవ పామును ఒంటెలు తినడం వల్ల ఆ వ్యాధి లక్షణాలు తగ్గించడంతో పాటు చికిత్స కూడా సహాయపడుతుందని సమాచారం.

పాములో ఉన్న విషం ఒంటె ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుందట. అందుకే బతికున్న పాములను ఒంటెలకు ఆహారంగా ఇస్తారు. అయితే అన్ని సందర్భాల్లో అందరూ దీనిని ఉపయోగించరు. శుష్క ప్రాంతాల్లో చాలామంది తమ పశువులను రక్షించుకోవడానికి ఇలా ప్రయత్నిస్తారు. కొందరు ఒంటెలను పవిత్రంగా చూస్తారు. కానీ ఎడారిలో ఒంటెలు జీవించడం వల్ల ఈ రకమైన పద్ధతిని పాటిస్తారట. వీటికి ఏదైనా అయితే వెంటనే అక్కడ చూపించుకోవడానికి పశువైద్యులు ఉండరు. కాబట్టి ఇలా ట్రై చేస్తారు. ఒంటెలు పాము విషం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి కలిగి ఉంటుంది. ఇతర జంతువులతో పోలిస్తే ఇవి వేరేగా ఉంటాయి. అయితే ఇది సైంటిఫిక్‌గా రుజువు కాలేదు. తప్పు అని చాలామంది భావిస్తున్నారు. కానీ ఇందులో ఏది నిజమని ఇంకా తెలియలేదు. బతికి ఉన్న పాములు ఒంటె తినడం వల్ల రెండు జంతువులకు హాని కలుగుతుందని చాలామంది అభిప్రాయం. ఒంటెలకు ఏదైనా సమస్య వస్తే మెరుగైనా చికిత్స చేయాలి కానీ ఇలా చేయడం ఏంటని చాలామంది అంటున్నారు. అసలు పాముల విషం ఒంటెలకు ఎలా నయం అవుతుందో అని సందేహ పడుతున్నారు. కష్ట సమయాల్లో ఒంటెలను కాపాడుకోవడానికి ఇలా ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. అంతే కానీ దీని గురించి పూర్తిగా రుజువు కాలేదు.