Drinikng water : ఖాళీ కడుపుతో ఎక్కువగా నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే!

ఖాళీ కడుపుతో నీరు ఎక్కువగా తాగితే ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది. మన శరీరంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎక్కువ నీరు తాగినప్పుడు ఇవి పోతాయి. దీంతో బలహీనత, అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే నీరు ఎక్కువగా తాగితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కిడ్నీలు సక్రమంగా పనిచేయవు.

Written By: Swathi, Updated On : August 18, 2024 6:49 pm

empty stomach Drinking water

Follow us on

Drinikng water :  నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు చెబుతుంటారు. ప్రతి జీవికి కూడా నీరు అనేది ముఖ్యం. అయితే నీరు లేకుండా మానవులు బ్రతకడం కష్టం. శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నీరు అనేది చాలా ముఖ్యం. అయితే ఉదయాన్నే ఏం తినకుండా ఎక్కువగా నీరు తాగడం వల్ల నష్టాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ మితంగా మాత్రమే తాగాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు అంటున్నారు. సాధారణంగా నీరు ఎక్కువగా తాగితే పర్లేదు. కానీ ఖాళీ కడుపుతో తాగడం వల్ల తీవ్రమైన సమస్యల బారిన పడతారట. ఏ పూట అయిన ఏం తినకుండా నీరు కూడదు. ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో నీరు తాగితే ఏమవుతుందో చూద్దాం.

ఖాళీ కడుపుతో నీరు ఎక్కువగా తాగితే ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది. మన శరీరంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎక్కువ నీరు తాగినప్పుడు ఇవి పోతాయి. దీంతో బలహీనత, అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే నీరు ఎక్కువగా తాగితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కిడ్నీలు సక్రమంగా పనిచేయవు. శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించడంలో కిడ్నీలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కానీ నీరు ఎక్కువగా తాగి వీటిని పాడుచేసుకుంటే కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నీరు అధికంగా తాగితే శరీరంలోని సోడియం స్థాయిలు తగ్గుతాయి. దీంతో హైపోనాట్రేమియా వస్తుంది. దీనివల్ల వాంతులు, కండరాల తిమ్మిరి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. వెంటనే చికిత్స అందించకపోతే కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఖాళీ కడుపుతో నీరు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మంచిదని ఉదయం లేచిన వెంటనే ఎక్కువగా నీరు తాగవద్దు. గ్లాసు నుంచి రెండు గ్లాసుల నీరు మాత్రమే తాగండి. దీనికంటే ఎక్కువగా తాగితే సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. ఉదయం పూట లేచిన వెంటనే చల్లని నీరు కంటే గోరువెచ్చని నీరు తాగడం మంచిది. గోరువెచ్చని నీరు వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. అయితే నీరును కూడా కేవలం మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు. ఒక్కసారిగా ఎక్కువగా తాగకుండా నెమ్మదిగా తాగడం అలవాటు చేసుకోండి.