https://oktelugu.com/

Sudigali Sudheer: నాకంటే పెద్ద సెలబ్రిటీ ఎవ్వడూ లేడంటున్న సుడిగాలి సుధీర్..బలుపు మామూలుగా లేదుగా!

సుధీర్ కెరీర్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈటీవీ లో ప్రసారమయ్యే సగం ఎంటర్టైన్మెంట్ షోస్ సుడిగాలి సుధీర్ మీదనే నడిచేవి. ఆ స్థాయిలో ఆయన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా పలు సినిమాలు చేసిన సుధీర్ హీరో కూడా అయ్యాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 19, 2024 / 08:12 AM IST

    Sudigali Sudheer(1)

    Follow us on

    Sudigali Sudheer: కష్టపడితే సాధించలేనిదంటూ ఏమి లేదని చెప్పడానికి ఎంతోమంది ఉదాహరణగా నిలిచారు. అలాంటి ఉదాహరణలలో ఒకరు సుడిగాలి సుధీర్. పూటగడవడం కోసం అప్పట్లో సుధీర్ పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. ఒక్క అవకాశం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరిగేవారు. సుధీర్ కి మ్యాజిక్ చెయ్యడం వచ్చు కాబట్టి అతనిలో టాలెంట్ ని గమనించి అన్నపూర్ణ స్టూడియోస్ లో మ్యాజిక్ షోస్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలా మొదలైన సుధీర్ కెరీర్, ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో వేణు వండర్స్ టీం లో చేసే అవకాశం దక్కింది. ఈ టీంలో సుధీర్ కామెడీ టైమింగ్ ఎంతో ప్రత్యేకంగా అనిపించేది. అంతనిలో ఉన్న ఈ కామెడీ టైమింగ్ ని పసిగట్టే మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సుడిగాలి సుధీర్ ని ఒక టీం లీడర్ ని చేసింది.

    అలా ప్రారంభమైన సుధీర్ కెరీర్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈటీవీ లో ప్రసారమయ్యే సగం ఎంటర్టైన్మెంట్ షోస్ సుడిగాలి సుధీర్ మీదనే నడిచేవి. ఆ స్థాయిలో ఆయన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా పలు సినిమాలు చేసిన సుధీర్ హీరో కూడా అయ్యాడు. మొదటి రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా మూడవ సినిమా ‘గాలోడు’ మాత్రం పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ‘కాలింగ్ సహస్త్ర’ చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆయన హీరో గా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఇప్పటికే ‘అయ్యో పాపం సారూ’ అనే సాంగ్ విడుదలై మంచి హిట్ అయ్యింది. ఇలా సుధీర్ కి అన్నీ కలిసి వస్తుండడంతో నాకు మించిన సెలబ్రిటీ ఎవ్వరూ లేదు అంటున్నాడు. ఇది ఆయన నిజంగా అన్న మాట కాదు, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ నుండి నేడు విడుదలైన రెండవ పాట. ‘ సెలబ్రిటీ నీకంటే ఎవడురా’ అంటే సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట కూడా క్వాలిటీ పరంగా బాగా ఉండడంతో సుధీర్ ఈ సినిమాతో మరోసారి పెద్ద హిట్ కొట్టబోతున్నాడని ఆయన అభిమానులు అంటున్నారు.

    ఇక సుడిగాలి సుధీర్ ని మళ్ళీ ఆయన అభిమానులు బుల్లితెర మీద చూడాలి అని కోరుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళకోసమే ఆయన ఈటీవీ లో ప్రస్తుతం ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘ఫ్యామిలీ స్టార్స్’ అనే షో చేస్తున్నాడు. ఈ షో తో పాటుగా ఆయన మొన్నటి వరకు ఆహా మీడియా లో ‘సర్కార్ 4 ‘ షో చేసాడు. అంతకు ముందు సీజన్స్ మొత్తం యాంకర్ ప్రదీప్ చెయ్యగా, ఈ సీజన్ మాత్రం సుడిగాలి సుధీర్ చేసాడు. త్వరలోనే ఆయన ఈటీవీ లో ప్రసారం అవ్వబోయే ఢీ సరికొత్త సీజన్ కి యాంకర్ గా వ్యవహరించబోతున్నాడని తెలుస్తుంది.