Great Emu War Australia: సాధారణంగా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు.. సైనికులు మాత్రమే ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి ఆధునిక కాలంలో యుద్ధాలు అంటే మిస్సైల్స్ ద్వారా.. డ్రోన్ల ద్వారా చేస్తున్నారు. ఒకప్పుడు మాత్రం యుద్ధాలు సైనికులు మాత్రమే చేసేవారు. ఆయుధ సామాగ్రిని.. మందు గుండు సామాగ్రిని యుద్దాలలో వాడేవారు. అప్పట్లో యుద్ధాలలో పక్షులను కూడా ఉపయోగించేవారు. కాకపోతే గద్దలు, రాబందుల జాతికి సంబంధించిన పక్షులను ప్రత్యర్థుల ఆనుపానులు తెలుసుకునేందుకు వాడేవారు.
ఈ ప్రపంచంలో ఇంతవరకు ఆయా దేశాల మధ్య జరిగిన యుద్ధంలో కేవలం సైనికులు ముందు వరుసలో పాల్గొన్నారు. యుద్ధంలో వారు మరణిస్తే.. ఆ తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉండేవి. శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగిన తర్వాత యుద్ధాల తీరు మారిపోయింది. సైనికులతో పాటు.. అత్యాధునిక ఆయుధాలతో యుద్ధాలు చేయడం పెరిగిపోయింది.. అయితే చరిత్రలో తొలిసారిగా ఓ దేశం యుద్ధం చేసింది. కాకపోతే ప్రత్యర్థి దేశంతో కాదు. పక్షుల మీద.. అయితే ఆ యుద్ధంలో ఆదేశం ఓడిపోయింది.
ఆస్ట్రేలియా గురించి మీకు తెలుసు కదా.. చుట్టూ సముద్రాలు.. ఉన్న ఈ దేశంలో అపారమైన ఖనిజ నిల్వలు ఉంటాయి. కంగారు లాంటి జంతువులు ఇక్కడ విస్తారంగా నివసిస్తూ ఉంటాయి. ఆస్ట్రేలియాలో పంట పొలాలు అధికంగా ఉంటాయి. ఇక్కడ మొక్కజొన్న అధికంగా పండుతుంది. చెరుకు కూడా అదే స్థాయిలో సాగవుతూ ఉంటుంది.. ఇక్కడ పంట పొలాలు విస్తరంగా ఉండడంతో.. ఈము పక్షులు దాడి చేసేవి. పంట ఉత్పత్తులను తినేవి. దీనివల్ల రైతులకు విపరీతంగా నష్టం వచ్చేది. రైతులు ఆ పక్షులను నియంత్రించలేక ఇబ్బంది పడ్డారు. చివరికి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు.
ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి సైన్యాన్ని రంగంలోకి దింపింది. సైన్యం భారీగా కాల్పులు జరిపినప్పటికీ ఈము పక్షులు లొంగలేదు. పైగా తుపాకులకు.. బుల్లెట్ల కాల్పుల లొంగకుండా చాకచక్యంగా పరుగులు పెట్టేవి. వాటి వేగం ముందు ఆస్ట్రేలియా సైన్యం ఓడిపోయింది. ఆర్మీపై పక్షులు గెలిచిన ఈ సందర్భాన్ని గ్రేట్ ఈము వార్ అని పిలుస్తుంటారు. ఇప్పటికీ ఈ విషయం ప్రస్తావనకు వస్తే ఆస్ట్రేలియా ప్రజలు తలదించుకుంటారు. తమ సైన్యం పక్షుల ముందు ఓడిపోడాన్ని వారు అసలు జీర్ణించుకోలేరు.