Homeవింతలు-విశేషాలుGirls Present Generation: ఆటో డ్రైవర్లనే అమ్మాయిలు ఎందుకు ఇష్టపడుతుంటారు?

Girls Present Generation: ఆటో డ్రైవర్లనే అమ్మాయిలు ఎందుకు ఇష్టపడుతుంటారు?

Girls Present Generation: చదువుకుంటున్నప్పుడో.. ఉద్యోగానికి వెళ్తున్నప్పుడో.. లేదా అత్యవసరంగా వేరే పని మీద వెళ్లాల్సినప్పుడో.. ఆడవాళ్లు ముఖ్యంగా యువతులు ఆటో ఎక్కడం అనేది సర్వసాధారణం. అయితే ఈ ప్రక్రియ రొటీన్ గా సాగిపోతే పెద్ద ఇబ్బందిగా ఉండదు. ఆటోలలో సాగించే ప్రయాణంలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటాయి. చివరికి ఆ అమ్మాయిలు ఆటో డ్రైవర్లతో ప్రేమలో పడేదాకా అవి వెళ్తుంటాయి. కొన్ని సందర్భాలలో ఆటో డ్రైవర్లతో పారిపోయి పెళ్లి చేసుకునే సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఆటో డ్రైవర్ లను తప్పు పట్టడం కాదు.. ఆ అమ్మాయిలను తక్కువ అంచనా వేయడం కాదు. కాకపోతే అమ్మాయిలు ఎక్కువగా ఆటో డ్రైవర్లను ఎందుకు ఇష్టపడతారనేది ఓ ఆసక్తికరమైన విషయం.

Also Read: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టైటిల్ మార్పు..కొత్త టైటిల్ ఇదే..కారణం ఏంటంటే!

నేటి కాలంలో చదువుకున్న అమ్మాయిలు వారి తోటి విద్యార్థులతోనో, లేదా బంధువుల అబ్బాయిలతోనూ ప్రేమలో పడటం సర్వసాధారణం. ఎందుకంటే వారి వయసు కూడా అటువంటిది. కానీ కొంతమంది అమ్మాయిలు మాత్రం వీరందరినీ కాదని తమ ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్లతో ప్రేమ యాణం సాగించడం నిజంగా ఆశ్చర్యకరం. అయితే ఈ పరిణామాన్ని మనసత్వ శాస్త్రవేత్తలు వేరే విధంగా చెబుతున్నారు.

ఆటో డ్రైవర్లను చూసినప్పుడు కొంతమంది యువతుల్లో శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. మెదడులో రకరకాల భావోద్వేగాలు కలుగుతుంటాయి. అవి ఆకర్షణకు గురిచేస్తుంటాయి. అప్పటివరకు చూడని కొత్తదనాన్ని పరిచయం చేస్తుంటాయి.. ఎందుకంటే మెదడులో డోప మైన్ అనే హార్మోన్ విడుదలవడం వల్ల.. అప్పటికప్పుడు అంతులేని ఉత్సాహం కలుగుతుంది.. విపరీతమైన ఆనందం కళ్ళ ముందు కనిపిస్తుంది. అంచనాలకు అందని ఆసక్తి మనసులో కలుగుతుంది. తద్వారా ఆ ప్రయాణాన్ని ఆ యువతి ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇతడితో కలిసి ఉండాలి అనే భావనను కలిగిస్తుంది. వాస్తవానికి దీనిని చాలామంది తప్పు పడుతుంటారు కానీ ఇది పూర్తిగా న్యూరో కెమికల్ మత్తు.

ఆటో డ్రైవర్ చూసే విధానం.. గౌరవించే తీరు యువతులకు విపరీతంగా నచ్చుతుంటాయి. ఆ సమయంలో ఆక్సి టోసిన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వారిద్దరి మధ్య బంధాన్ని పెంపొందించడంలో తోడ్పడుతుంటాయి. ఈ సమయంలో వారిద్దరి మధ్య బంధం సామాజికంగా వ్యతిరేకతను చవిచూస్తే.. అప్పుడు ఆ యువతి మెదడులో సెరటోనిన్ స్థాయి తగ్గిపోతుంది.

ఆటో డ్రైవర్ తో ఒక యువతి సంబంధం ఏర్పరచుకుంటే దానిని సమాజం అంతగా ఒప్పుకోదు. అలాంటప్పుడు ఆమె మెదడులో ఆడ్రి నలిన్, కార్డి స్టోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అవి అతనిపై విపరీతమైన ఆకర్షణకు గురి చేస్తుంటాయి. వాటివల్ల రహస్యంగా కలుసుకోవాలని ఆత్రుతను ఆమెలో పెంచుతాయి. చుట్టూ ఒత్తిడి వాతావరణం ఆమెలో ఇలాంటి మార్పులకు కారణమవుతుంటాయి.

ఆటో డ్రైవర్లు సాధారణంగా తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేరు. వాళ్ల మాటలు సూటిగా ఉంటాయి. హావభావాలు అత్యంత పదునుగా ఉంటాయి. వారు నవ్వే విధానం కూడా బాగుంటుంది. అందువల్లే యువతులు ఆ లక్షణాలను చూసి ఇష్టపడుతుంటారు. ఒకరకంగా ఎమోషనల్ మిర్రర్ అనే బంధాన్ని ఏర్పరచుకుంటారు.. అందువల్లే ఈ బంధం క్రమంగా బలపడి ప్రేమగా మారుతుంది. ఒకానొక క్షణంలో పెళ్లి వరకు దారితీస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular