చిన్నప్పుడు మనం అదుగో పులి కథ చదువుకున్నాం. ఓ మేకల కాపరి చుట్టుపక్కల వారిని భయపెట్టేందుకు పులి అని కేకలు వేస్తాడు. దీంతో ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టి వచ్చి చూస్తే చివరికి అది వట్టిదే అని తెలుసుకుని ఎవరి పనుల్లో వారు పడిపోతారు. కానీ తరువాత కొద్ది సేపటికి నిజంగా పులి వచ్చి మేకల మందపై దాడి చేస్తుంది. కానీ ఆ బాలుడి కేకలు వేసినా ఎవరు రారు. దీంతో పులి మేకలను చంపి వెళ్తుంది. ఇదో కథ. నిజానికి ఇలాంటి కథే ఇవాళ హైదరాబాద్ లో చోటుచేసుకుంది. సంతోష్ నగర్ కు చెందిన ఓ యువతి గ్యాంగ్ రేప్ జరిగిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టి విచారణ చేపట్టారు. తీరా చివరికి అదంతా వట్టిదే అని తేలడంతో ఆశ్చర్య పోయారు. ఇలాంటి దురంతాలు చోటుచేసుకోవడంతో పోలీసులకు నిజంగా జరిగినా స్పందించరని తెలుస్తోంది.
సంతోష్ నగర్(Santosh Nagar) కు చెందిన యువతి(20) బుధవారం సాయంత్రం సమయంలో తనను ముగ్గురు ఆటో డ్రైవర్లు ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్(Gang Rape) చేశారని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వార్త పెను సంచలనం సృష్టించింది. ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు వేగం పెంచారు. యువతి చెప్పిన వివరాల ప్రకారం దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తులో తలమునకలైపోయారు. కానీ ఇందులో ఆమె చెప్పిన వివరాల్లో నిజం లేదని గ్రహించి యువతినే మరోమారు ప్రశ్నించారు.
యువతి చెప్పిన వివరాల ప్రకారం ఆరా తీయగా కిడ్నాప్, అత్యాచారం అంతా కట్టుకథ అని తేలిపోయింది. ఎలాంటి ఆనవాళ్లు దొరకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు యువతిని ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. తన బాయ్ ఫ్రెండ్ కి వివాహం నిర్ణయం కావడంతో అతడిని కేసులో ఇరికించేందుకు యువతి రేప్ డ్రామా ఆడినట్లు చెప్పింది. దీంతో యువతి ప్రవర్తనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెపై చర్యలు తీసుకోవడానికి నిర్ణయించినట్లు సమాచారం.
ఇదంతా చూస్తుంటే యువతి పోలీసులను పెడతోవ పట్టించినట్లు తెలుస్తోంది. అత్యాచారాలపై ఓ పక్క రాష్ర్టమంతా అట్టుడికిపోతుంటే యువతి కావాలనే పోలీసులతో ఆడుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓ పక్క కేసులపై సీరియస్ గా తీసుకుంటుంటే వారిని ఇలా పక్కదారి పట్టించడంలో యువతి ఆటలాడుకోవడం దారుణం. రేప్ జరగలేదని తెలియడంతో అవాక్కయ్యారు గతంలో కూడా ఘట్ కేసర్ కేసులో కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Huge twist in hyderabad girl gang rape case
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com