https://oktelugu.com/

Free Wine : టాప్ తిప్పితే చాలు.. మద్యం ధారలే.. గ్లాసులో పట్టుకుని ఉచితంగా తాగడమే..

ఇటలీ దేశంలో డోరా సర్చెస్ అనే ద్రాక్షతోట యజమానులు ఫ్రీ రెడ్ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ఈ ఫౌంటెన్ వద్ద రెడ్ వైన్ 365 రోజులు ఉచితంగా లభిస్తుంది. వాస్తవానికి ఇటలీ దేశంలో ఉచితంగా వైన్ అందించడం కొత్తకాదు. మారినో అనే పట్టణంలో ప్రతి ఏడాది గ్రేప్ ఫెస్టివల్ జరుగుతుంది. ఒక గంట పాటు ప్రజల కోసం పబ్లిక్ వాటర్ ఫౌంటెన్ ట్యాప్ లలో వైట్ వైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 28, 2024 / 09:47 PM IST
    Follow us on

    Free Wine  : ఎక్కడికక్కడ ట్యాప్ లు ఉంటాయి. అలా తిప్పితే చాలు మద్యం వస్తుంది. గ్లాసులో పట్టుకొని ఎంతైనా తాగొచ్చు. డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. మనదేశంలో లిక్కర్ ఆదాయం మీదే ప్రభుత్వాలు నడుస్తున్న నేపథ్యంలో.. ఇలా ఉచితంగా మద్యం ట్యాప్ లు ఎవరు ఏర్పాటు చేశారు? అలా ఎలా సాధ్యం? అనే ప్రశ్నలు మీలో ఉత్పన్నమవుతున్నాయి కదూ. అయితే పై ఉపోద్ఘాతం మొత్తం నిజమే.. కాకపోతే అలా ఉచితంగా మద్యం వచ్చే వెసలుబాటు మన దగ్గర కాదు.. ఇంతకీ ఆ సౌకర్యం ఎక్కడ ఉందనే కదా మీ డౌటు.. ఇంకా ఎందుకు ఆలస్యం చదివేయండి ఈ కథనం..

    ఇటలీలో

    ఇటలీ దేశంలో డోరా సర్చెస్ అనే ద్రాక్షతోట యజమానులు ఫ్రీ రెడ్ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ఈ ఫౌంటెన్ వద్ద రెడ్ వైన్ 365 రోజులు ఉచితంగా లభిస్తుంది. వాస్తవానికి ఇటలీ దేశంలో ఉచితంగా వైన్ అందించడం కొత్తకాదు. మారినో అనే పట్టణంలో ప్రతి ఏడాది గ్రేప్ ఫెస్టివల్ జరుగుతుంది. ఒక గంట పాటు ప్రజల కోసం పబ్లిక్ వాటర్ ఫౌంటెన్ ట్యాప్ లలో వైట్ వైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిరోజు రెడ్ వైన్ అందుబాటులో ఉంటుంది. ఇటలీ దేశంలో రెడ్ వైన్ ఉచితంగా అందించే మొదటి ఫౌంటెన్ గా ఇది గుర్తింపు పొందింది.

    వినూత్నంగా అందించాలని..

    ఇటలీ దేశంలో విభిన్నమైన సేవలు అందించాలని ఇక్కడి ద్రాక్ష యజమానులు అప్పట్లో భావించారు. అందులో భాగంగానే ఫ్రీ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత రోమ్ నగరం నుంచి ఒర్టోనా వరకు 196 మైళ్ళ దూరం ఉంటుంది. ఇంత దూరం ప్రతి ఏడాది సాంస్కృతిక యాత్ర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కొన్ని వేల మంది కేథలిక్ లు పాల్గొంటారు. ఈ దారి వెంట ప్రయాణం సాగించే వారి బడలిక తీర్చేందుకు ప్రసిద్ధ కామినో డి షాన్ టోమ్మాసో దగ్గర ఈ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ట్యాప్ తిప్పి తమకు కావలసిన పరిమాణంలో వైన్ తాగి ముందుకు వెళ్తారు. మరింత కావలసిన వాళ్లు పెద్ద పెద్ద బాటిల్స్ లో నింపుకొని వెళ్తూ ఉంటారు. వాస్తవానికి దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్లు దొరకడమే గగనమైన ఈ రోజుల్లో ఇటలీ దేశంలో ఏకంగా రెడ్ వైన్ అందించడం.. అది కూడా ఉచితంగా ఇవ్వడం గొప్ప విషయమే కదా.. అయితే ద్రాక్ష తోట యజమానులు తమ ఎస్టేట్లో పండే పండ్లను ఈ వైన్ తయారీ కోసం వినియోగిస్తారు. వేలాది ఎకరాల్లో తోటలు విస్తరించిన నేపథ్యంలో బాగా పక్వానికి వచ్చిన పండ్లతో వారు ఈ వైన్ తయారు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి రసాయనాలు కలపకపోవడంతో.. వైన్ ను క్యాథలిక్ లు ఆస్వాదిస్తూ తాగుతుంటారు.

    ఈ వైన్ లో కేవలం ద్రాక్షరసం మాత్రమే కలుపుతారు.. అందువల్లే క్యాథలిక్ లు ఇష్టంగా తాగుతుంటారు. దీనివల్ల సత్వర శక్తి లభిస్తుందని వారు నమ్ముతుంటారు. పైగా ఈ ద్రాక్ష పండ్లను సహజ సిద్ధంగా పండించడం వల్ల.. వాటితో తయారు చేసే వైన్ అత్యంత రుచికరంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ వైన్ తాగడం వల్ల శరీరం ఉత్తేజానికి గురవుతుందని.. ఎటువంటి రుగ్మతలు ఉన్నా మాయమవుతాయని క్యాథలిక్ లు చెబుతుంటారు.. కొందరైతే బాటిళ్లలో నింపుకొని తమకు ఇష్టమైన వారికి బహుమతిగా ఇస్తుంటారు. అయితే ఎంత స్థాయిలో వైన్ తాగినప్పటికీ ద్రాక్ష తోట నిర్వాహకులు ఏమాత్రం అడ్డు చెప్పరు.