Fastest Birds: ప్రకృతి చాలా అందమైనది. అలాగే ఊహకు అందని ఎన్నో వింతలు విశేషాలు కూడా ఉంటాయి. ఇవి చాలా సందర్భాల్లో తెలియకుండానే ఉంటాయి. కానీ కొందరు పరిశోధకులు వీటి గురించి పరిశీలన చేసి బయటపెడుతూ ఉంటారు. ప్రకృతిలో మనుషుల్లాగే పక్షులకు ప్రత్యేక జీవనం ఉంటుంది. అవి ఆహారం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాయి. అలాగే తమ పిల్లల కోసం గూడు నిర్మించుకుంటూ ఉంటాయి. ప్రపంచంలో అనేక రకాల పక్షులు ఉన్నాయి. కానీ అన్ని ఒకేలా ఉండవు. కొన్ని వేగవంతంగా ప్రయాణం చేస్తే.. మరికొన్ని నెమ్మదిగా వెళుతూ ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా వేగంగా వెళ్లే కొన్ని పక్షుల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్ళండి..
Also Read: ఆసియాలోనే అతిపెద్ద సైనికుల గ్రామం.. ప్రతి ఇంట్లో ఒక జవాన్!
పక్షులు అనగానే మనకు గరుడ, గ్రద్ద, రాబందు వంటి పెద్ద పక్షుల గురించి తెలిసి ఉంటుంది. కానీ వీటి కంటే కూడా అత్యంత వేగంగా వెళ్లే పక్షులు కూడా ఉన్నాయి. వాటిలో పెరిగ్రిన్ ఫాల్కన్ ఒకటి. ఈ ఈ పక్షిని ఆకాశంలో రాజు అంటారు. ఎందుకంటే పెరిగ్రిన్ ఫాల్కన్ గంటకు 242- 380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ పక్షికి మించిన మరో పక్షి ఇంత స్పీడుతో వెళ్లలేదు. గాలిలో విమానంలా దూసుకెళ్లే ఈ పాట వచ్చి శరీర నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి పదునైన కళ్ళు, బలమైన రెక్కలు ఉంటాయి. దీని రెక్కలు బలంగా ఉండడంతో వేగంగా వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది.
ఈ పక్షి తర్వాత మరో పక్షి గోల్డెన్ ఈగల్. ఈ పక్షి గంటకు 128 – 192 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. మీ పక్షికి పంజాలు బలంగా ఉంటాయి. వీటితో ఇది దేనినైనా తగిలించుకొని వెళ్లవచ్చు. ఉత్తర అమెరికా, యూరప్ లో దర్శనమిచ్చే ఈ పక్షి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది.
అత్యంత వేగంగా వెళ్లే మరొక పక్షి వైట్ త్రోతెడ్. ఈ పక్షి గంటకు 170 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. సన్నని శరీరంతో కలిగిన ఈ పక్షికి పొడవైన రెక్కలు ఉంటాయి. ఇవి వేగంగా వెళ్లేందుకు ఉపయోగపడతాయి. తన వేగంతో కీటకాలను వేటాడి చంపి తింటుంది. ఎక్కువగా ఆసియాలో కనిపిస్తుంది. ఆస్ట్రేలియన్ హాబీ అనే మరో పక్షి గంటకు వంద కిలోమీటర్ల వేగంగా పరిగెడుతుంది. ఈ పక్షి చిన్న పక్షులను, కీటకాలను తింటూ జీవిస్తుంది. మిగతా పక్షుల కంటే చురుగ్గా కదులుతూ కేటాకాలను చంపకు తింటూ ఉంటుంది.
ఈ పక్షులు కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కానీ మిగతా పక్షుల కంటే ప్రత్యేకంగా నిలుస్తూ ధైర్యంగా ప్రయాణించి కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రపంచంలో అన్నిటికంటే పెరిగ్రిన్ ఫాల్కన్ నెంబర్ వన్ స్థానంలో పయనిస్తూ ఉంటుంది. దీనిని డక్ హాక్ అని కూడా అంటారు. ఈ పచ్చి శరీర పొడవు 36 నుంచి 49 సెంటీమీటర్లు ఉంటుంది. పెద్దపెద్ద జంతువులను సైతం మీది అలా ఒకగా ఎత్తుకెళ్తుంది.