Elephants : మనుషుల వలే ఏనుగులు ఏడుస్తాయి.. ఆ ఏనుగుల కన్నీటి కథ ఇదీ

వయస్సులో ఉన్న మగ ఏనుగులు ఆడ ఏనుగులను వస పర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాయి. వేర్వేరు దారుల్లో వెళ్తున్న మగ ఏనుగులు ఆడ ఏనుగులను తాకుతూ వెళ్తాయి. అలాగే ఏనుగులకు ఓ కుటుంబం ఏర్పడిన తర్వాత వాటిని కాపాడుకుంటాయి. కుటుంబ సంరక్షణ కోసం గుంపులుగా మాత్రమే ఉంటాయి.

Written By: NARESH, Updated On : August 12, 2024 3:01 pm

Elephants Crying

Follow us on

Elephants : ఈప్రపంచంలో కేవలం మనుషులకు మాత్రమే భావోద్వేగాలు ఉంటాయి. జంతువులకు ఉండవని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇది తప్పని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏనుగులు కూడా మనుషుల వలె ప్రవర్తిస్తాయి. ఇవి ఒంటరిగా ఉండకుండా కుటుంబంతో కలిసి గుంపుగుంపులుగా జీవిస్తాయి. మనుషులు ఎలా ఇష్టమైన వాళ్లను, బంధువులను కలిసినప్పుడు హత్తుకుంటారో ఏనుగుల అంతే. వాళ్ల స్నేహితులను చూసినప్పుడు తోక ఊపడం, సంతోషం ఎక్కువగా ఉంటే ఘీంకారనాదం చేస్తాయి. స్నేహితులైన ఏనుగులు కలినప్పుడు ఒకరి తొండాలను ఒకరు పెనవేసుకుంటాయి. మానవులు ఎలా ప్రవర్తిస్తారో.. ఏనుగులు కూడా అలానే ప్రవర్తిస్తాయి. వీటి ప్రవర్తన దాదాపుగా మనుషుల్ని పోలి ఉంటుంది.

వయస్సులో ఉన్న మగ ఏనుగులు ఆడ ఏనుగులను వస పర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాయి. వేర్వేరు దారుల్లో వెళ్తున్న మగ ఏనుగులు ఆడ ఏనుగులను తాకుతూ వెళ్తాయి. అలాగే ఏనుగులకు ఓ కుటుంబం ఏర్పడిన తర్వాత వాటిని కాపాడుకుంటాయి. కుటుంబ సంరక్షణ కోసం గుంపులుగా మాత్రమే ఉంటాయి. పిల్లలను ఒంటరిగా వదిలేయవు. ఒక ఏనుగు మరోక ఏనుగతో మాట్లాడుతుంటాయి. వాటికి ఆకలి వేసినప్పుడు తల్లి ఏనుగుకి చెబుతాయి. గున్న ఏనుగులు యాక్షన్ చేస్తూ తల్లికి తమ ఆకలిని తెలియజేస్తాయి. అల్లరి చేస్తాయి. తల్లులు తిడితే అలుగుతాయి. తల్లి వెంట వెళ్లకుండా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతాయి. మనుషులు ఎలా ఏది కావాలంటే అది ఇస్తేనే ఒప్పుకుంటారు. లేకపోతే మారాం చేస్తారు. ఏనుగులు అంతే. మనుషుల్లానే ఏనుగులు కూడా పిల్ల ఏనుగులను బుజ్జిగిస్తేనే మళ్లీ తల్లులు మాట వింటాయి. ఒక్కసారి బుజ్జిగిస్తే మాట వినవంట. మనుషులు ఎలా వాళ్లను బ్రతిమలాడటానికి ప్రయత్నాలు చేస్తారో అలా చేస్తేనే అవి మళ్లీ దారిలోకి వస్తాయి. లేకపోతే అలుగుతూ చెప్పిన మాట వినకుండా ఉంటాయి.

మనుషులు వాళ్ల ఇష్టమైన వాళ్లను కోల్పోతే ఏడుస్తారు. ఆ విషయాన్ని మర్చిపోవడానికి చాలా కష్టపడతారు. మర్చిపోవాలని ట్రై చేసిన వాళ్ల గుర్తులతో బాధపడుతుంటారు. ఏనుగులు కూడా ఇలానే ప్రవర్తిస్తారట. వాళ్లకి ఇష్టమైన వాళ్లను కోల్పోతే ఏడుస్తాయట. ఒక మనిషి చనిపోతే ఎలా అతని చుట్టూ అందరూ కూర్చోని ఏడుస్తారో ఏనుగులు అంతే. ఒక ఏనుగు చనిపోతే దాని కళేబరం దగ్గర కూర్చోని అన్ని ఏనుగులు కన్నీరు కారుస్తాయి. మనతో కలిసి ఉన్న ఏనుగు వదిలి వెళ్లిపోయిందని బాధపడతాయట. ఆ ఏనుగు కళేబరాన్ని మిగిలిన జంతువులు తినకుండా ఉండాలని అక్కడే కూర్చోని దానిని కాపాడుతాయి. అవసరమైతే ఏనుగుల గుంపు అంతా కలిసి ఆ కళేబరాన్ని పూడ్చిపెడతాయి. వీటికి కేవలం భావోద్వేగాలు మాత్రమే కాకుండా తెలివి, జ్ఙాపకశక్తి కూడా ఉంటాయట. ఏనుగుల భావోద్వేగాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వియన్నా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం చేశారట. ఆఫ్రికా అడవుల్లోని ఏనుగుల్లో ఈ అధ్యయనం చేయగా మనుషుల వలె వీటికి కూడా భావోద్వేగాలు ఉన్నాయని తెలిసింది. ఈ అధ్యయంలో శాస్త్రవేత్తలు మొత్తం 1282 రకాల ప్రవర్తనలను గుర్తించారట.