Girls makeup : అమ్మాయిలు ఈ విషయం మీకు తెలుసా.. మేకప్ వేసుకోకపోతే బోలెడన్నీ లాభాలంటా!

మేకప్ వేసుకోకపోతే అందంగా ఉండమని భావించి ఎక్కువమంది వేసుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే రోజూ మేకప్ వేసుకోవడం వల్ల చర్మం దానికే అలవాటు పడుతుంది. దీంతో మేకప్ ఉంటేనే అందంగా కనిపిస్తామనే ఆలోచనలో ఉంటారు. ఒక నెల రోజులు మేకప్ వేసుకోవడం మానేసి చూడండి. మీ చర్మం ఎంత చక్కగా ఉంటుందో మీరే చూస్తారు.

Written By: NARESH, Updated On : August 12, 2024 2:47 pm

Girls Makeup

Follow us on

Girls makeup : ఈరోజుల్లో అమ్మాయిలు అసలు మేకప్ లేనిదే బయట అడుగు కూడా పెట్టరు. కొంతమంది అయితే ఇంట్లో ఉన్నా మేకప్ వేసుకుంటారు. ఎప్పుడు మేకప్ వేసుకునే ఉంటారు. ఇలా నిరంతరంగా మేకప్ వేసుకోవడం వల్ల చర్మం దెబ్బతింటుంది. కనీసం అప్పుడప్పుడు అయిన మేకప్ వేసుకోవడం మానేస్తే బోలెడన్నీ లాభాలున్నాయి. కొన్ని రోజులు మేకప్ వేసుకోవడం మానేయండి. మీ చర్మం ఎలా ఉంటుందో, ఫలితం మీకే తెలుస్తుంది.

మేకప్ వేసుకోకపోతే అందంగా ఉండమని భావించి ఎక్కువమంది వేసుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే రోజూ మేకప్ వేసుకోవడం వల్ల చర్మం దానికే అలవాటు పడుతుంది. దీంతో మేకప్ ఉంటేనే అందంగా కనిపిస్తామనే ఆలోచనలో ఉంటారు. ఒక నెల రోజులు మేకప్ వేసుకోవడం మానేసి చూడండి. మీ చర్మం ఎంత చక్కగా ఉంటుందో మీరే చూస్తారు. ఎప్పుడు మేకప్ ఉండటం వల్ల మేకప్‌లోని బ్యాక్టీరియా చర్మాన్ని నాశనం చేస్తుంది. కొన్ని రకాల మేకప్‌లు నాశిరకమైనవి ఉంటాయి. వీటిని వాడటం వల్ల కొందరికి చర్మంపై దద్దర్లు రావడం, స్కిన్ పొడిబారడం, నల్లగా మారుతాయి. కాబట్టి వీలైతే మేకప్ వేసుకోవడం మానేయండి. అంతగా వేసుకోవాలనిపిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మేకప్ వేయండి.

మొటిమలు వచ్చే అవకాశం ఉంది
మేకప్ వేసుకోవడం వల్ల చర్మంపై రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే మేకప్ వేసుకోకపోతే.. రంధ్రాలు తెరిచి ఉంటాయి. దీంతో చర్మంపై మొటిమలు రాకుండా అందంగా ఉంటారు. మేకప్ వేసుకోవడానికి ఉపయోగించే బ్రష్‌ల్లో బ్యాక్టీరియా ఉంటుంది. వీటిని ఎంత క్లీన్ చేసి ఉపయోగించినా సరే.. ఇందులో ఉండే బ్యాక్టీరియా చర్మం మీదకి చేరుతుంది. అదే మేకప్ వేసుకోకపోతే ఈ బ్యాక్టీరియా చర్మంపై చేరకుండా ఉంటుంది. దీనివల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు వృద్యాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. ముఖంపై ముడతలు కనిపించకుండా సాధారణంగా మేకప్ వేస్తారు. కానీ దీనివల్ల ఇంకా ఈ ముడతలు ఎక్కువవుతాయని నిపుణులు చెబుతున్నారు. అదే మేకప్ వేసుకోవడం మానేస్తే చర్మసమస్యలేవి ఉండవు.

ఇలా చేస్తే కనురెప్పుల విరిగిపోతాయి
మేకప్‌లో భాగంగా కళ్లకు మస్కరా, ఐలైనర్ వంటివి వాడుతారు. వీటిని రోజూ కళ్లకు పెడతారు. వీటిని కళ్లకు పెట్టడం వల్ల అందంగా కనిపిస్తారని భావిస్తారు. కానీ నిద్రపోయేటప్పుడు వీటిని శుభ్రం చేసుకోరు. దీనివల్ల కనురెప్పులు గట్టిగా అయి విరిగిపోతాయి. కనురెప్పలు పలుచగా అయి.. మళ్లీ ఆరోగ్యంగా పెరగవు. కాబట్టి మేకప్ వేసుకోకుండా ఉంటే కనురెప్పులు అందంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. కళ్లకు కాజల్ అందాన్నిస్తుంది. స్వయంగా ఇంట్లోనే తయారు చేసి ఉపయోగిస్తే కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మీరు అందంగా కనిపిస్తారు. కాబట్టి ఒక నెల రోజులు మేకప్ వేసుకోకుండా ఉండండి. వీటికి బదులు సహజ పద్ధతుల్లో ఉండే సౌందర్య పద్ధతులను ఉపయోగిస్తే చర్మం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు మీరు యవ్వనంగా కనిపిస్తారు.