https://oktelugu.com/

Fasting  : ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!

ఉపవాసంలో ముఖ్యంగా పండ్లు, పాల పదార్థాలు, రైతా, మిల్క్ షేక్స్ తీసుకుంటారు. ఈ సమయంలో నీరసంగా ఉండటం వల్ల ఇవి తాగితే తక్షణమే శక్తి లభిస్తుందని భావించి వీటిని తీసుకుంటారు. అయితే ఇవి అంత తొందరగా జీర్ణం కావని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా కొవ్వు, ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది. ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వేగంగా జీర్ణం కావు.

Written By:
  • NARESH
  • , Updated On : August 13, 2024 / 01:07 AM IST

    Fasting

    Follow us on

    Fasting : సాధారణంగా చాలామంది దేవుడు మీద భక్తితో ఉపవాసం చేస్తుంటారు. కానీ కొంతమంది ఫిట్‌గా ఉండటం కోసం ఉపవాసం చేస్తారు. శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఉపవాసం ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడే కొందరికి ఏదైనా తినాలనిపిస్తుంది. మరికొందరికి ఈ ఉపవాసం వల్ల ఆకలి తగ్గుతుంది. దీంతో అలా బరువు తగ్గుతారు. అయితే ఉపవాస చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తెలియక కొన్ని పదార్థాలను తీసుకుంటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఈ జాగ్రత్తలు ఉపవాస సమయంలో పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు.

    ఉపవాసంలో ముఖ్యంగా పండ్లు, పాల పదార్థాలు, రైతా, మిల్క్ షేక్స్ తీసుకుంటారు. ఈ సమయంలో నీరసంగా ఉండటం వల్ల ఇవి తాగితే తక్షణమే శక్తి లభిస్తుందని భావించి వీటిని తీసుకుంటారు. అయితే ఇవి అంత తొందరగా జీర్ణం కావని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా కొవ్వు, ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది. ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వేగంగా జీర్ణం కావు. దీనివల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. అలాగే కడుపు ఉబ్బరం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బనానా షేక్ ఆరోగ్యానికి మంచిదని వెంటనే శక్తి లభిస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఇవి ఉపవాస సమయంలో అంతమంచివి కాదట. ఈ సమయంలో సూప్‌లు, ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది.

    పాల ఉత్పత్తులు, పండ్లు ఏవైనా తినడానికి ఒక రెండు గంటల గ్యాప్ ఇవ్వాలి. అలాగే సిట్రిక్ ఆమ్లం వంటి పండ్లు తీసుకున్న వెంటనే పాల ఉత్పత్తులను తీసుకోవద్దు. కొంత సమయం తర్వాత మాత్రమే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. చాలామంది రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం లేదా టిఫిన్స్, పండ్లు, రసాలు తీసుకుంటారు. కానీ కొందరు వీటి ప్లేస్‌లో సలాడ్లు తీసుకుంటారు. అయితే రాత్రిపూట పచ్చి కూరగాయలు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆయుర్వేదం చెబుతోంది. రాత్రిపూట పచ్చి ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదట. ఈ ఆహారాన్ని జీర్ణం చేయడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఉపవాస సమయంలో రాత్రిపూట సలాడ్స్ తినడం మానేయాలి. వీటికి బదులు జ్యూస్ తీసుకోవడం మంచిది.

    ఉపవాస సమయంలో వేయించిన ఆహారాన్ని కూడా తినకూడదు. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. వేయించిన ఫుడ్స్‌కి బదులు కాల్చిన ఆహారాన్ని తినడం హెల్త్‌కి మంచిది. ఈ ఆహారం శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. అలాగే ఉపవాసంలో ఉన్నప్పుడు స్వీట్లు తినకూడదు. ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచడంతో పాటు బరువు పెరిగేలా చేస్తుంది. ఖాళీ కడుపుతో ఉండటం వల్ల ఈ స్వీట్స్ దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. ఇలాంటి సమయంలో కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. దీనివల్ల నీరసం తగ్గుతుంది. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉపవాసం చేయాలి. కానీ ఎక్కువ సార్లు ఉపవాసం చేయకూడదు. మితంగా మాత్రమే చేస్తే ఆరోగ్యంగా ఉంటారు.