Elder brother Fight With Dog: కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత మనం అనేక సందర్భాల్లో వినే ఉంటాం. కానీ వాస్తవంలో అప్పుడప్పుడు ఆ అనుభవాన్ని చవి చూసే ఉంటాం. బుడ్డోడు కూడా ఆ సామెతను నిజం చేసి చూపించాడు. అయితే అతడు చేసిన పని కెమెరాలో రికార్డు కావడం.. అది సోషల్ మీడియాలోకి ప్రవేశించడం.. దెబ్బకు వైరల్ కావడంతో ఒక్కసారిగా ఆ బుడ్డోడు చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. దీంతో ఆ బుడ్డోడి తెగవను అందరూ మెచ్చుకుంటున్నారు. గొప్ప పని చేశావు అంటూ కితాబిస్తున్నారు.
ట్విట్టర్లో కనిపిస్తున్న ఆ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. అయితే ఇద్దరు చిన్నపిల్లలు ఇంటికి వెళ్తున్నారు. వర్షం కూడా కురుస్తోంది. ఆ రోడ్డుమీద పెద్దగా అలికిడి లేదు. ఇదే క్రమంలో ఓ కుక్క అటువైపు నుంచి వస్తోంది. ఆ చిన్నారుల్లో ఓ బాబును కరవడానికి ప్రయత్నించింది. అయితే ఆ బుడ్డోడి వెనుక అతడి సోదరుడు ఉన్నాడు. తన తమ్ముడిని గట్టిగా పట్టుకోవడమే కాకుండా.. తాను ధరించిన చెప్పుల్లో ఒకదానిని తీసి కుక్కను బెదిరించాడు. చెప్పును చూసిన కుక్క వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన తమ్ముడిని మరింత జాగ్రత్తగా పట్టుకొని ఆ బాలుడు ముందుకు తీసుకుపోయాడు.
ఇటీవల కాలంలో కుక్క కాట్లు పెరిగిపోతున్నాయి. సాధారణంగా వీధి కుక్కలు వాటి లాలాజలంలో రకరకాల వైరస్ లను కలిగి ఉంటాయి. ఆ కుక్కలు కాటు వేసినప్పుడు ఆ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది ప్రమాదకరమైన రోగాలకు కారణమవుతుంది. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా పోవచ్చు. అందువల్ల కుక్క కాటు బారిన పడకుండా చూసుకోవాలి. సాధ్యమైనంతవరకు స్వీయ రక్షణను పాటించాలి. అయితే ఇవన్నీ చేసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కుక్కల నుంచి కాపాడుకోవడం కష్టమవుతుంది.
Also Read: ఇవే తగ్గించుకుంటే మంచిది.. లేదంటే పోతార్రరేయ్.. సజ్జనార్ వీడియో వైరల్
అయితే ఈ వీడియోలో ఆ బాలుడు మాత్రం కుక్కకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. పైగా అది దాడి చేసే ప్రమాదం ఉండడంతో ముందుగానే జాగ్రత్తపడ్డాడు. చెప్పుతో దానిని బెదిరించాడు. దీంతో ఆ కుక్క వెనక్కి వెళ్ళిపోయింది. అతడి తమ్ముడికి కుక్క కాటు పడటం తప్పిపోయింది. ఆ బాలుడు చూపించిన తెగువ చాలామందిని ఆకట్టుకుంటున్నది.
“అది వీధి కుక్క. చాలా బలంగా ఉంది. ఆ ఇద్దరు చిన్నారులు కూడా అమాయకంగా కనిపిస్తున్నారు. అయితే ఓ బాలుడు తన తమ్ముడిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం గొప్పగా ఉంది. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. కుక్క పక్కకు వచ్చినప్పుడు భయపడే దానికంటే.. దాని నుంచి కాపాడుకోవడం చాలా ఉత్తమం. ఈ బాలుడు చేసిన పని కూడా అలాంటిదే. ఇది చాలా మందికి ఆదర్శంగా ఉందని” నెటిజన్లు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Kalesh b/w Dogesh and Siblings: pic.twitter.com/o0ctiTo7ev
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 5, 2025