Elon Musk political party: ప్రపంచ కుబేరుడు.. టెస్సా, స్పేస్ ఎక్స్, స్టార్ లింక్, న్యూరా లింక్, ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్. మొన్నటి వరకు అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డోజ్(డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషికెన్సీ) అధినేతగా ఉన్నారు. జూన్‌లో సంస్థ నుంచి బయటకు వచ్చాడు. ట్రంప్ తెచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్‌ను వ్యతరేకించాడు. ట్రంప్‌పై విమర్శలు చేశాడు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును కాంగ్రెస్ ఆమోదిస్తే రిపబ్లిక్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెడతానని ప్రకటించారు. ఈ క్రమంలో ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదింపజేసుకున్నాడు. మస్క్ ముందే హెచ్చరించినట్లు అమెరికా కోసం అంటూ ది అమెరికా పార్టీని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Also Read: మోదీ గేమ్ స్టార్ట్.. టర్కీ, అజర్‌బైజాన్, చైనాకు చెక్‌మేట్!
ఎలాన్ మస్క్, ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరు, అమెరికాలో ‘అమెరికా పార్టీ‘ అనే కొత్త రాజకీయ పార్టీని 2025 జూలై 5న ప్రకటించారు. ఈ చర్య, అమెరికాలోని రెండు–పార్టీల వ్యవస్థను సవాల్ చేస్తూ, ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, ఆర్థిక శిస్తును పాటించడంపై దృష్టి సారించింది. మస్క్ సంపద, సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ నియంత్రణ, అతని ప్రజాదరణ ఈ ప్రయత్నానికి ఊతమిచ్చాయి. అయితే, భారతదేశంలో ఇలాంటి ప్రయోగం ఎలా ఉంటుంది? భారతదేశ రాజకీయ వాతావరణం, పరిశోధన సంస్థలైన ఈడీ, సీబీఐ కార్యకలాపాల నేపథ్యంలో, ఇలాంటి ఒక కొత్త పార్టీ ప్రకటన సాధ్యం కాదు.
భారత రాజకీయ వ్యవస్థలో అడ్డంకులు
భారతదేశంలో ఒక బిలియనీర్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి ప్రయత్నిస్తే, అతను ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ కఠినమైన నిబంధనలు, జాతీయ స్థాయిలో ప్రచారం కోసం అవసరమైన ఆర్థిక, సామాజిక వనరులు ఒక పెద్ద అడ్డంకి. అంతేకాక, ఈడీ, సీబీఐ వంటి సంస్థలు, తరచూ రాజకీయ ప్రత్యర్థులపై లేదా ప్రభుత్వ వ్యతిరేక శక్తులపై ఎక్కువ దృష్టి సారిస్తాయనే విమర్శలు ఉన్నాయి. 2014 నుంచి ఈడీ దర్యాప్తు చేసిన కేసులలో 80% కంటే ఎక్కువ విపక్ష నాయకులపైనే ఉండడం ఇందుకు నిదర్శనం. ఇలాంటి సంస్థలు, ఒక బిలియనీర్ రాజకీయ నాయకుడి వ్యాపార సంస్థలపై దర్యాప్తులు ప్రారంభించవచ్చు, దీనివల్ల ఆర్థిక, ప్రతిష్ఠాత్మక నష్టం జరిగే అవకాశం ఉంది.
పాలకుల చేతిలో దర్యాప్తు సంస్థలు..
భారతదేశంలో ఈడీ, సీబీఐ వంటి సంస్థలు ఆర్థిక అక్రమాలు, అవినీతిని నిరోధించడానికి ఏర్పాటు చేయబడినవి. అయితే, ఈ సంస్థలు కొన్నిసార్లు రాజకీయ ప్రేరేపితంగా పనిచేస్తాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక బిలియనీర్ కొత్త పార్టీని స్థాపిస్తే, ఈ సంస్థలు వారి వ్యాపార కార్యకలాపాలు లేదా ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించి, దర్యాప్తులను ప్రారంభించవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రివాల్ వంటి వ్యక్తులు రాజకీయ కార్యకలాపాల సమయంలో దర్యాప్తులను ఎదుర్కొన్నారు. ఇలాంటి చర్యలు, చట్టబద్ధమైనవి అయినా, ఒక కొత్త రాజకీయ శక్తిని బలహీనపరచడానికి ఉపయోగపడవచ్చు.
అమెరికాలో బలమైన వ్యవస్థలు..
అమెరికాలో మస్క్ కొత్త పార్టీకి ఎక్స్‌లో నిర్వహించిన ఒక సర్వేలో 65% మద్దతు లభించింది. అయితే, భారతదేశంలో ఒక బిలియనీర్ రాజకీయ పార్టీని స్థాపిస్తే, ప్రజల ధోరణి భిన్నంగా ఉండవచ్చు. భారతీయ ఓటర్లు, ముఖ్యంగా గ్రామీణ, మధ్యతరగతి వర్గాలు, ఒక బిలియనీర్ నాయకత్వంలోని పార్టీని ఉన్నతవర్గ లేదా సామాన్య జన జీవన సమస్యలకు దూరమైనదిగా భావించవచ్చు. భారతదేశంలోని వైవిధ్యమైన సామాజిక, సాంస్కృతిక నేపథ్యం కొత్త పార్టీకి జాతీయ స్థాయిలో మద్దతు సమీకరించడాన్ని సవాలుగా మార్చవచ్చు. అమెరికాలో వ్యవస్థలు బలంగా ఉంటాయి. ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా బలమైన వ్యవస్థల కారణంగా పెద్దగా ఆర్థిక, ప్రతిష్ట నష్టం ఉండదు.
Also Read: పాకిస్తాన్ మిస్సైల్‌ను మోసగించిన భారత్ డీకాయ్.. ఈ అద్భుత టెక్నాలజీతో పాక్ చిత్తు.. వైరల్ వీడియో
భారత్‌లో ఈజీ కాదు..
భారతదేశంలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం అంత ఈజీ కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పాలకులను ఎదుర్కొని పుట్టినదే. అయితే, ఒక బిలియనీర్ నాయకత్వంలోని పార్టీకి విజయవంతం కావడానికి బలమైన గ్రాస్‌రూట్ ఉద్యమం, స్థానిక నాయకులతో సంకీర్ణ ఒప్పందాలు, దర్యాప్తు సంస్థల నుంచి వచ్చే చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం అవసరం. భారతదేశంలో రాజకీయ వ్యవస్థ కేంద్రీకృతం కావడం, సంస్థలు రాజకీయ ఒత్తిడులకు లోనవుతాయనే ఆరోపణల నేపథ్యంలో, ఇలాంటి ప్రయోగం ఎన్నో అడ్డంకులను ఎదురవుతాయి.
