వింతలు-విశేషాలుDogs And Humans Marriage Tradition: కుక్కలతో మనుషులకు పెళ్లా.. ఇదేం ఆచారం రా నాయనా

Dogs And Humans Marriage Tradition: కుక్కలతో మనుషులకు పెళ్లా.. ఇదేం ఆచారం రా నాయనా

Dogs And Humans Marriage Tradition: మన దగ్గర వర్షాలు సరిగా కురువకపోతే కప్పలకు పెళ్లి చేస్తారు. అప్పటికి వర్షాలు కురువకపోతే వరద పాశం వండి.. దేవతామూర్తులకు పెడతారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆలయాలలో దేవతామూర్తులకు జలాభిషేకం చేస్తారు.

ఇక కొన్ని ప్రాంతాలలో అయితే వేప చెట్టుకు, రావి చెట్టుకు వివాహాలు జరిపిస్తారు. ఇలా చేస్తే త్వరగా కాయలు కాస్తాయని.. పెద్దలు నమ్ముతుంటారు. కానీ.. మనుషులకు కుక్కలకు వివాహం జరపడం.. ఎప్పుడైనా చూశారా.. లేదా విన్నారా.. చదువుతుంటే వింతగా ఉంది కాదు.. మీకే కాదు మాకు కూడా అలానే ఉంది. ఇంతకీ ఈ ఆచారం ఎక్కడుంది.. ఎందుకు జరుపుతారు.. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనం ఏంటంటే..

జార్ఖండ్ రాష్ట్రంలో ఆటవిక తెగలు అధికంగా ఉంటాయి. వీరి నమ్మకాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత.. వారు పెద్దగా అవుతున్న క్రమంలో.. వచ్చే దంతాలు.. కింది దవడకు కాకుండా.. పై దవడకు వస్తే దానిని అరిష్టమని భావిస్తుంటారు. అందువల్లే అలా దంతాలు వచ్చిన పిల్లలకు కుక్కలతో పెళ్లిళ్లు చేస్తారు. ఇలా చేస్తే కీడు తొలగిపోతుందని నమ్ముతుంటారు. ఆ పిల్లలు పెద్దయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. కీడు తొలగించుకోవడానికి మాత్రమే ఇలాంటి పని చేస్తుంటారు.

కుక్కలతో పెళ్లి చేసే క్రతువును కూడా గొప్పగా జరుపుతారు.. ఇంటిల్లిపాది వేడుకలు నిర్వహిస్తారు. పండగలాగా దానిని భావిస్తుంటారు. దగ్గర బంధువులను పిలుచుకొని విందు భోజనాలు చేస్తారు. దానికంటే ముందు నిండుకుండ అన్నాన్ని తీసి గ్రామదేవతకు నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వల్ల దుష్టశక్తుల పీడ వదిలి పోతుందని వారు నమ్ముతుంటారు.

అప్పట్లో ఐశ్వర్యరాయ్ కి జాతకంలో కీడు ఉందని ఆమెకు ఒక చెట్టుతో పెళ్లి చేశారని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఇక ఇదే జార్ఖండ్లో పెళ్లి నిశ్చయమైన యువతీ యువకులకు జాతకం చూసే క్రమంలో విచిత్రమైన విధానాన్ని పాటిస్తుంటారు. ఒక నాటుకోడిని కోస్తారు. ఆ తర్వాత దాని కాలేయం రంగును బట్టి ఆ యువతి యువకుల జాతకాన్ని చెబుతుంటారు. ఆ జాతకం ఆధారంగానే పెళ్లి ముహూర్తాలు ఖరారు చేస్తారు.. ఇలా ఎన్నో ఆచారాలు ఝార్ఖండ్ ఆటవిక తెగలు కొనసాగిస్తుంటాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Teacher Viral Video: ఈ టీచర్ చేసిన పనికి.. పిల్లలు ‘మాకొద్దు మొబైల్’ అని అంటున్నారు.. వీడియో వైరల్

Teacher Viral Video: స్మార్ట్‌ఫోన్‌లు నేటి కాలంలో చిన్నారుల జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయాయి. పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలన్నా, అన్నం తినిపించాలన్నా, ఏడుపు ఆపాలన్నా చాలా మంది తల్లిదండ్రులు వారి చేతిలో...

Viral Train Video: ఏడిపించిన పాపానికి.. మగాడిని ఆడపిల్లను చేసేసింది ఈ యువతి

Viral Train Video: పెదాలకు లిప్ స్టిక్ పూసింది. ముఖానికి పౌడర్ రాసింది. అందంగా ముస్తాబు చేసింది.. వాస్తవానికి ఇవన్నీ ఒక ఆడపిల్ల పూసుకుంటే బాగుంటుంది. ఒక మగాడు రాసుకుంటే మాత్రం ఈ...

Movies And Healthy Aging: సినిమాలు చూస్తే వృద్ధాప్యం రాదట..

Movies And Healthy Aging: అస్తమానం ఆ టీవీ ఏంటి.. ఊరికే సినిమా చూడకపోతే మరేం పని లేదా.. ఆ ఫోన్లో గంటల తరబడి చూస్తావు.. ఏముంది అందులో.. ఇలాంటి ప్రశ్నలు...

Daughter In Law Funny Reel: అత్తపై ఫన్నీ రీల్ పెట్టిన కోడలు.. ట్విస్టేంటంటే కొడుకు అరెస్ట్.....

Daughter In Law Funny Reel: ఇటీవల చాలా మంది రీల్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. భార్య భర్తలు, స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో భాగంగా అత్తా కోడళ్లు కలిసి వీడియోలు తీస్తున్నారు....

Liquor Weighing Video: చుక్క తేడా రావద్దు.. త్రాసులో పెట్టి మందును తూకం వేశాడు.. భాస్కర్ అవార్డు నీకే...

Liquor Weighing Video: చుక్క తేడా రావద్దు. తేడా వచ్చిందంటే మాట వచ్చేస్తుంది. అత్యంత జాగ్రత్తగా.. ఏదో శాస్త్రవేత్తలాగా అతడు మందును తూకం వేశాడు. దానికోసం త్రాసు ఉపయోగించాడు. అసలు అతని డెడికేషన్...
Exit mobile version