https://oktelugu.com/

Viral News : కుక్క ఇంట్లో దూరిందని డయల్ 100 పోలీసులకు ఫోన్ చేశాడు.. తర్వాత ఏం జరిగిందంటే?

సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన కొంతమంది ఆ వ్యక్తికి బాసటగా నిల్వగా.. మరి కొంతమంది ఇన్నాళ్లు కోతుల బెడదే అనుకుంటే.. ఇప్పుడు ఆ స్థానంలో కుక్కలు చేరాయంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 28, 2024 9:40 pm

    dog in the house, dial 100, phone the police

    Follow us on

    Viral News : ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కార మార్గం చూసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఆ సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తే.. మరింత పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు అసలు సమస్య పక్కకు వెళ్లిపోయి.. కొత్త సమస్య వెలుగులోకి వస్తుంది.. ఆ తర్వాత తలనొప్పి మరింత పెరుగుతుంది.. ఓ పెద్ద మనిషి కూడా తన సమస్య విషయంలో ఇలానే ఆలోచించాడు. అది పెరిగి పెద్దదయింది. చివరికి పోలీసుల దాకా వెళ్ళింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

    సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతడు ఉన్న ప్రాంతంలో కుక్కలు విపరీతంగా ఉన్నాయి. గేటు వేసినప్పటికీ అవి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆ కుక్కలు ఇంట్లోకి ప్రవేశించడమే కాదు.. అరుస్తున్నాయి, కర్రతో బెదిరిస్తే కరుస్తున్నాయి. దీంతో ఏం చేయాలో ఆ వ్యక్తికి అర్థం కాలేదు. పైగా ఇటీవల గేటు వేసినప్పటికీ.. కుక్కలు ఇంట్లోకి ప్రవేశించాయి.. ఏం చేయాలో అంతుపట్టక ఆ వ్యక్తి డయల్ 100 కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు ఆయన ఇంట్లోకి వచ్చారు.

    పోలీసులు ఇంట్లోకి వచ్చిన తర్వాత.. సమస్య ఏమిటో చెప్పాలని ఆ వ్యక్తిని అడిగారు.. దానికి అతడు “నా ఇంట్లోకి కుక్కలు వస్తున్నాయి సార్. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిరోజులుగా నేను ఆ కుక్కలతో వేగలేక పోతున్నానని” చెప్పాడు.. దానికి పోలీసులు ” మీ ఇంట్లోకి కుక్కలు వస్తే మేము బయటికి వెళ్లగొట్టాలా? కుక్కలు ఇంట్లోకి రాకుండా గేటు వేసుకోవాలి. లేకుంటే ఇంకా ఏదైనా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అంతేతప్ప ఇలా పోలీసులకు సమాచారం అందించడం ఏంటి” అని వారు ఆ వ్యక్తిని నిలదీశారు..” కుక్కలతో ఇబ్బంది పడుతున్నాను. మీరే ఏదైనా పరిష్కార మార్గం చూపిస్తారని ఫోన్ చేశానని” ఆ వ్యక్తి పోలీసులతో అన్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆ వీడియో అక్కడితోనే ఎండ్ అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన కొంతమంది ఆ వ్యక్తికి బాసటగా నిల్వగా.. మరి కొంతమంది ఇన్నాళ్లు కోతుల బెడదే అనుకుంటే.. ఇప్పుడు ఆ స్థానంలో కుక్కలు చేరాయంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.