king cobra : ఇటీవల జనారణ్యంలోకి అటవీ జంతువులు ప్రవేశిస్తున్నాయి. ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే పాములు, తేళ్లు వంటి విష జంతువుల గురించి చెప్పనవసరం లేదు. ఎక్కడో ఓ చోట తారస పడతాయి. అటు సోషల్ మీడియాలో సైతం అటువంటి జంతువుల జాడ కనిపించినప్పుడు వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన మురుగు కాలువలను శుభ్రం చేస్తుంటారు. ఓ చోట ఇలా పనులు చేస్తుండగా వింత ఆకారం కదిలినట్టు కనిపిస్తుంది. వారు భయం భయంగా వెళ్లి చూడగా షాకింగ్ దృశ్యం వారి కంటపడింది. లోపల భారీ సైజు కింగ్ కోబ్రా ఉండడాన్ని గుర్తించారు. వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు.వారంతా అతి కష్టం మీద ఆ పొడవాటి నాగుపామును బయటకు తీశారు.ఆ పాము ఆకారం చూసి స్థానికులు బింబెలెత్తిపోయారు. చాలాసేపు శ్రమించిన తర్వాత స్నేక్ క్యాచర్లు ఆ పామును బంధించగలిగారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు వరుస పెట్టి కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.
అయితే ఈ వీడియో ఎక్కడిది అన్నది మాత్రం తెలియడం లేదు.కానీఇండియాలో అయితే మాత్రం కాదు.అయితే ఆ కింగ్ కోబ్రా భారీ సైజులో ఉంది. దానిని పట్టుకోవడం అంత సులువు కాదు. కానీ ఎంతో ధైర్యం చేసి పట్టుకున్నారు స్నేక్ క్యాచర్లు. వారికి హ్యాట్సాఫ్ చెప్పాలంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. అది సాహసంతో కూడుకున్న పని అని.. ప్రజారక్షణకు వారు ముందడుగు వేశారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.
The size of this cobra
pic.twitter.com/0Hmhv9qFfV— Science girl (@gunsnrosesgirl3) April 25, 2024