Homeవింతలు-విశేషాలుDogs Plane: శునకాలకూ ఓ విమానం.. టికెట్‌ ధర, సౌకర్యాలు ఇవే..!

Dogs Plane: శునకాలకూ ఓ విమానం.. టికెట్‌ ధర, సౌకర్యాలు ఇవే..!

Dogs Plane: పెంపుడు జంతువుల్లో మనుషులు ఎక్కువగా ఇష్టపడేది శునకాలనే. ఆ తర్వాతే ఇతర జంతువులు ఉంటాయి. విశ్వాసానికి మారుపేరు అయిన శునకాలను జంతు ప్రేమికులు తమ పిల్లలతో సమానంగా చూసుకుంటారు. ఇక కరోనా తర్వాత పెట్స్‌ పెంపకానికి మరింత ఆసక్తి చూపుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితంతో ఒంటరవుతున్న మనిషి జంతువులతో, ముఖ్యంగా శునకాలతో అనుబంధం పెంచుకుంటున్నారు. అయితే ఈ పెంపుడు జంతువులను మనుషులు ప్రాయణించే బస్సులు రైళ్లలో అనుమతించరు. మనం ఎక్కడికైనా వెళితే వాటిని తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. సొంత వాహనం ఉంటే సమస్య ఉండదు. కానీ, ప్రభుత్వ వాహనాల్లో తీసుకెళ్లడం కష్టం. ఎందుకంటే వాటితో ప్రయాణించడానికి మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడతారు. కానీ పెంపుడు శునకాల కోసం ఇక్కడో విమానమే ఉంది. శునకాల ప్రయాణ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు బార్క్‌ ఎయిర్‌ అనే సంస్థ పెంపుడు శునకాల కోసమే విమాన సేవలు ప్రారంభించింది. తొలి విమానం న్యూయార్క్‌ నుంచి లాస్‌ ఏంజెల్స్‌కు చేరుకుంది. మొదటి సర్వీస్‌లోనే అన్ని టికెట్లు అమ్మడయ్యాయని సంస్థ తెలిపింది.

బార్క్‌ సంస్థ నేపథ్యమిదీ..
ఇక శునకాలకు విమాన సర్వీస్‌లు ప్రారంభించి బార్క్‌ సంస్థ శునకాలకు ఆహారం, ఆటబొమ్మలను తయారు చేసి విక్రయిస్తుంది. ఓ జñ ట్‌ ఛార్టర్‌ సర్వీస్‌ కంపెనీతోఒ జట్టుకట్టి బార్క్‌ ఎయిర్‌ను ప్రారంభించింది. ఏప్రిల్‌లో తమ కొత్త సేవలను ప్రనకటించింది.

ప్రపంచంలో రెండోది..
శునకాల ప్రయాణం కోసం ఏర్పాటైన రెండో విమానయాన సంస్థ బార్క్‌ ఎయిర్‌. యూకేకు చెందిన కే9 జెట్స్‌ అనే ప్రైవేటు సంస్థ ఈ సేవలను మొదట ప్రారంభించింది. శునకాల అవసరాలకు అనుగుణంగా విమానంలో బార్క్‌ ఎయిర్‌ అన్ని సవతులు కల్పించింది. వాటితోపాటు మనుషులు కూడా ప్రాయణించొచ్చు. అయితే ఏర్పాట లవిషయంలో మాత్రం శునకాలకే తొలి ప్రాధాన్యం ఇస్తుంది.

ప్రక్రియ ఇలా…
శునకాల ప్రయాణానికి ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. గంట తర్వాత విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. చెక్‌ ఇన్‌ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. క్యూలైన్లు, బోనుల వంటి హడావుడి ఉండదు. విమాన సిబ్బంది అక్కడి నుంచే వారి సేవలను అందిస్తారు. శునకాలకు విమానంలో ఇరుకుగా ఉండొద్దనే ఉద్దేవంతో విమాన సామర్థ్యం మొత్తానికి ఎప్పుడూ టికెట్‌ బుకింగ్‌ తీసుకోబోమని బార్క్‌ ఎయిర్‌ తెలిపింది.

ప్రత్యేక వసతులు..
ఇక శునకాల కోసం విమానాల్లో ప్రత్యేక క్యాబిన్లు ఉంటాయి. ప్రత్యేక క్యాబిన్‌లో మ్యూజిక్, లావెండర్‌ సెంట్‌తో కూడిన టవళ్లు, సువాసన వెదజల్లే పాత్రలు సహా అవి సౌకర్యంగా ఉండేలా అన్ని వసతులు ఉంటాయి. సిబ్బంది దగ్గర జస్ట్‌ ఇన్‌ కేస్‌ పేరిట ప్రత్యేక సంచులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అందులో వాటికి కావాల్సిన ఆహారం, వాటిని కట్టేసేందుకు తాడు, మలమూత్రాల సంచులు సహా అన్నీ అందులో ఉంటాయి. మధ్యలో అవి ఆడుకునేందుకు విమానంలో అనేక బొమ్మలు, ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. బార్క్‌ ఎయిర్‌ విమానాలను 15 శేనకాలు, ఒక్కోదానికి ఒక వ్యక్తి ప్రయాణించేలా రూపొందించారు. కానీ 10 టికెట్లు మాత్రమే విక్రయిస్తామని కంపెనీ తెలిపింది.

ఆహారం.. జాగ్రత్తలు..
విమానాలు గాల్లో ఎగిరేటప్పుడు శునకాలు అసౌకర్యానికి గురికాకుండా వాటికి ప్రత్యేక స్నాక్స్‌ అందిస్తారు. ప్రయాణంలోనూ చాక్లెట్లుల, బిస్కెట్లు సహా ఇతరత్రా ఆహార పదార్థాలు అందజేస్తారు. ఇక విమానంలో ప్రయాణించే శునకాలకు క్రమం తప్పకుంఆడ టీకాలు వేయించి ఉండాలి. ఆరు నెలల్లో రేబిస్‌ బలంగా ఉన్న దేశాల్లో నివాసం ఉండకూడదు. శునకాల పరిమాణం, బ్రీడ్‌ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే మనుషుల మధ్య ఉన్నప్పుడు శునకాలు ఎలా ప్రయానిస్తాయి అనే విషయాన్ని యజమానులు ముందే పసిగట్టాలి. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయంటే అనుమతించారు.

టికెట్‌ ధర..
ప్రస్తుతానికి ఈ సేవలను న్యూయార్క్‌ నుంచి లాస్‌ ఏంజెల్స్, న్యూయార్క నుంచి లండన్‌ మధ్య ప్రారంభించారు. త్వరలో మరిన్ని మార్గాల్లోనూ సేవలను విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఈ విమానాల్లో శునకాలను తీసుకెళ్లడం కాస్త ఖరీదైందే. న్యూయార్క్‌ నుంచి లాస్‌ ఏంజెల్స్‌కు ఒక శునకం, మనిషి Ðð ళ్లడానికే 5 వేల డాలర్లు, న్యూయార్క్‌ నుంచి లండన వెళ్లడానికి 8 వేల డాలర్లు తీసుకుంటున్నారు. గిరాకి పుంజుకున్న కొద్దీ ధరలు తగ్గిస్తామని బార్క్‌ ఎయిర్‌ తెలిపింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular