Children Sleep: కొందరు పిల్లలు చూస్తే యాక్టివ్ గా ఉంటారు.. మరికొందరు డల్ గా కనిపిస్తారు.. ఇంకొందరు ఆవేదనను వ్యక్తం చేస్తారు.. అయితే ఒకే ప్రదేశంలో ఉండే పిల్లలు ఇలా విభిన్నంగా ప్రవర్తించడానికి కారణం వారు ఉదయం లేచిన పరిస్థితులే కారణమని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం నిద్రలేపే సమయంలో ప్రవర్తించిన తీరుతోనే వారి ప్రవర్తన అలా ఉంటుందని అంటున్నారు. చాలామంది తమ పిల్లలను స్కూలుకు పంపించాలని ఉద్దేశంతో రకరకాల ప్రవర్తనలతో నిద్ర లేపుతుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని కొందరు మానసిక ని పనులు తెలుపుతున్నారు. మరి ఉదయం పిల్లలను నిద్రలేపే సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలి?
పిల్లలను ఉదయం నిద్ర లేపే సమయంలో వారి గదిలో ఉన్న లైట్లను ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఫ్యాన్ ఆఫ్ చేయాలి. పిల్లలు నిద్రిస్తున్న గదిలో కిటికీలు ఉంటే వాటిని ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేసిన సమయంలో వారిపై కాంతి పడుతుంది. ఈ కాంతి ద్వారా వారు నిద్రలేచే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల వారికి అలవాటుగా మారి ఎవరికి వారే నిద్రలేచే ప్రయత్నం చేస్తారు.
ఉదయం పిల్లలను నిద్రలేపే సమయంలో వారితో స్నేహపూర్వకంగా ఉండాలి. వారి తలపై చేతిపెట్టి మెల్లిగా పిలవాలి. వారికి ఇష్టమైన పేరుతో లేదా ఇష్టమైన వస్తువును చెప్పి నిద్రలేపాలి. అలాగే వారిని బంగారం.. ముద్దుగుమ్మ లాంటి అందమైన పదాలతో నిద్ర లేపడం వల్ల వారు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు.
ప్రతిరోజు ఒకే సమయంలో నిద్ర లేపే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత వారికి ఆటోమేటిక్ గా మెలకువ వస్తుంది. ఇది వారికి అలవాటుగా మారిపోతుంది. అలాగే రోజు ఒకే సమయంలో నిద్ర రావడం వల్ల నిద్ర గడియారం ఏర్పడుతుంది.
ఉదయం నిద్ర లేవగానే వారిని కనీసం రెండు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొనివ్వాలి. అలా కాసేపు కూర్చున్న తర్వాత వారికి అవసరమైన పనులు చెప్పాలి. అంటే బ్రష్ చేయడం ఆ తర్వాత గ్లాసు నీళ్లు తాగడం వంటివి నేర్పించాలి. ఇలా పరిగడుపున నీరు తాగే అలవాటు చేయడం వల్ల వారి శరీరం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది
కొందరు తల్లిదండ్రులు పిల్లలు నిద్ర లేవగానే వారికి ఫోన్ లాంటి డివైసెస్ ఇస్తూ ఉంటారు. ఇలా ఇవ్వడం వల్ల వారి మైండ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఉదయం లేవగానే మొబైల్ లేదా టీవీ చూడడం వల్ల స్క్రీన్ లైట్ కళ్ళపై పడి ఒత్తిడి కలుగుతుంది.
తొందరగా నిద్రలేస్తే బహుమతులు ఇస్తామని చెప్పండి. అలా చెప్తే వారిలో ఉత్సాహం ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ రోజు ఒకే సమయానికి వారు నిద్రలేస్తే చిన్న చిన్న బహుమతులు ఇచ్చే ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల తొందరగా నిద్ర లేవాలన్న ఆలోచన ఉంటుంది.